శ్రీదేవి( Sridevi )… ఆమె చనిపోయే దాదాపు ఐదేళ్లు గడిచిపోయింది.ఫిబ్రవరి 24, 2018 న దుబాయ్ లో ఒక ఫంక్షన్ కోసం కుటుంబం అంత హాజరు కాగా, తన రూం లో బాత్ టబ్ లో మునిగి కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే.
అయితే శ్రీదేవి కేవలం మనకు ఒక స్టార్ హీరోయిన్ వెండితెరపై వెలుగులు చెందిన ఒక అందాల నటి కానీ ఆమె ఇద్దరు ఆడపిల్లలకు తల్లి తన ఇద్దరు కూతుళ్లకు తల్లి లేని ఈ సమయం అంతా ఎలా గడిచి పోతుందో నిజంగా ఆ దేవుడికే తెలియాలి 17 ఏళ్లకు వయసులో ఖుషి( kushi ) తల్లిని కోల్పోయి ఇలా నిబ్బరంగా తన జీవితాన్ని ముందుకు సాగిస్తుంది అనేది మనం ఊహించడానికి కష్టం.జాన్వి కపూర్ ని హీరోయిన్ ని చేసిన శ్రీదేవి తన చిన్న కూతురుని కూడా నటిని చేయాలని కలలు కన్నదట.

జాన్వి కపూర్( Janhvi Kapoor ) ప్రస్తుతం తన కెరియర్ హిందీలో అలాగే సౌత్ ఇండియాలో కూడా సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తుంది.అలాగే ఖుషి కపూర్ కూడా ఇటీవల ఒక సినిమాతో వెండి తెర ఎంట్రీ ఇచ్చేసింది.కానీ తన తల్లిని కోల్పోయిన రోజు వారి జీవితాల్లో ఏం జరిగింది? ఎలా ఉండింది ? అనే విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ ఇద్దరు సోదరీమణులు పంచుకున్నారు.దుబాయిలో తల్లి మరణించిన రోజు అదే హోటల్లో ఖుషి కపూర్, జాన్వి కపూర్ ఎవరి రూమ్ లో వారు ఉన్నారట.
విషయం తెలియగానే జాన్వి పరిగెత్తుకుంటూ ఖుషి ఉన్న రూమ్ లోకి వచ్చిందట.అప్పటికే ఖుషి కన్నీటి పర్యంతమవుతుందట.తన తల్లి లేదు అనే విషయం వారిద్దరికీ స్పష్టంగా అర్థమయిపోయింది.

కానీ ఒక్కసారిగా జాన్వీ ని చూడగానే ఖుషి ఏడవడం ఆపేసిందట.తనకు తన తండ్రి అక్క ఉన్నారని, ఆ కంఫర్ట్ తనకు గుర్తొచ్చే ఖుషి అప్పటి నుంచి ఇప్పటి వరకు తల్లి కోసం ఏడవ లేదట.ఏడ్చి తన బలహీనత ను కుటుంబానికి చుపించకుడదని, తన సపోర్ట్ ఇవ్వకుండా ఉండకూడదని తను అందరిని ఒకటిగా చేసి బలమైన ఫ్యామిలీ గా ఉండాలని నిర్ణయించుకుందట.
ఖుషి ఆ రోజు నుంచి నేటి వరకు ఆమె తల్లి కోసం ఏడవలేదు.కానీ లోపల మాత్రం ఎంతో అంతర్మథనం చూస్తున్నానని ఖుషి చెప్పడం విశేషం.