భారీగా పెరిగిన ఎన్ఆర్ఐల డిపాజిట్లు .. 2023తో పోలిస్తే ఎన్ని కోట్లంటే?

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు దేశానికి ఎనలేని సేవలందిస్తున్నారు.ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కంపెనీలు, పరిశ్రమలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ భారత ఆర్ధిక వ్యవస్ధకు చేయూతనిస్తున్నారు.

 Nri Deposits Rises 43% In April-december 2024 To $13.33 Billion , Nri Deposits R-TeluguStop.com

అంతేకాదు.ఎన్ఆర్ఐల ( NRIs )వల్ల మనదేశానికి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం లభిస్తోంది.

2024 ఏప్రిల్ – డిసెంబర్ మధ్యకాలంలో విదేశాలలో పనిచేస్తున్న భారతీయుల నుంచి ఎన్ఆర్ఐ ఖాతాలలోకి నిధుల ప్రవాహం 42 శాతం పెరిగి 13.33 బిలియన్ డాలర్లకు చేరుకుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( Reserve Bank of India ) (ఆర్‌బీఐ) గణాంకాలు చెబుతున్నాయి.2023లో ఇదే సమయంలో ఇది 9.33 బిలియన్ డాలర్లుగా ఉందని అధికారులు చెబుతున్నారు.డిసెంబర్ 2024 చివరి నాటికి మొత్తం ఎన్ఆర్ఐ డిపాజిట్లు 161.8 బిలియన్లకు పెరిగాయి.ఇది డిసెంబర్ 2023లో 146.9 బిలియన్లుగా ఉంది.ఎన్ఆర్ఐ డిపాజిట్ పథకాలలో ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్( Foreign Currency Non-Resident ) (ఎఫ్‌సీఎన్ఆర్) డిపాజిట్లు, అలాగే నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ (ఎన్ఆర్ఈ) డిపాజిట్లు , నాన్ రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్ఓ) డిపాజిట్లు ఉన్నాయి.

Telugu Fcnr, Nrideposits-Telugu Top Posts

2024 ఏప్రిల్ – డిసెంబర్ కాలంలో ఎఫ్‌సీఎన్ఆర్ (బీ) డిపాజిట్‌లలోకి అత్యధికంగా 6.46 బిలియన్ డాలర్ల నిధులు వచ్చాయి.గతేడాది ఇదే కాలంలో ఈ ఖాతాలో జమ అయిన 3.45 బిలియన్ల కంటే ఇది రెట్టింపు.ఎఫ్‌సీఎన్ఆర్ (బీ) ఖాతాలలో బకాయి ఉన్న మొత్తం డిసెంబర్ చివరి నాటికి 32.19 బిలియన్లకు పెరిగింది.ఎఫ్‌సీఎన్ఆర్ (బీ) ఖాతా కస్టమర్లు భారతదేశంలో ఉచితంగా మార్చుకోగలిగే విదేశీ కరెన్సీలలో ఒకటి నుంచి ఐదేళ్ల వరకు స్థిర డిపాజిట్‌ను అనుమతిస్తుంది.

Telugu Fcnr, Nrideposits-Telugu Top Posts

ఈ కాలంలో ఎన్ఆర్ఈ డిపాజిట్లు 3.57 బిలియన్ల ఇన్‌ఫ్లోను నమోదు చేశాయి.గతేడాది ఇదే కాలంలో ఇవి 2.91 బిలియన్లుగా ఉన్నాయి.డిసెంబర్ 2024 నాటికి బకాయి ఉన్న ఎన్ఆర్ఈ డిపాజిట్లు 99.56 బిలియన్లుగా ఉన్నాయి.2024 ఏప్రిల్ – డిసెంబర్‌లో ఎన్ఆర్‌వో డిపాజిట్లు 3.29 బిలియన్ల మేర ఇన్‌ఫ్లోలు నమోదయ్యాయి.ఇది గతేడాది 2.97 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube