దుబాయ్(Dubai) వేదికగా బంగ్లాదేశ్‌తో(Bangladesh) జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు.టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టుకు భారత పేసర్లు మహ్మద్ షమీ, హర్షిత్ రాణా (Mohammed Shami, Harshit Rana)చుక్కలు చూపించారు.
అనంతరం అక్షర్ పటేల్ తన స్పిన్ మాయాజాలంతో బంగ్లా బ్యాటర్లను ఉక్కిరి బిక్కిరి చేశాడు.అయితే, అక్షర్ పటేల్ తన తొలి అంతర్జాతీయ హ్యాట్రిక్‌ను కొద్దిలో కోల్పోయాడు.
ఇందుకు కారణం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Team India captain Rohit Sharma) చేసిన తప్పిదమే.అవును అదెలా అంటే.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో 9వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్, రెండో బంతికి తాంజిద్ హసన్(Tanjid Hassan), మూడో బంతికి ముష్ఫికర్ రహీంలను పెవిలియన్‌కు పంపాడు.దీంతో అక్షర్‌కు హ్యాట్రిక్ సాధించే అవకాశం వచ్చింది.
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన జాకీర్ అలీకి రోహిత్ శర్మ(Rohit Sharma , Zakir Ali) క్లోజ్ ఫీల్డ్‌ను ఏర్పాటు చేశాడు రోహిత్.ఇక నాలుగో బంతిగా అక్షర్ ఔట్ సైడ్ ఆఫ్ దిశగా ఆఫ్ బ్రేక్ డెలివరీను వేయగా.
దాన్ని జాకీర్ అలీ(Zakir Ali) డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేసాడు.అయితే, బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్లిప్స్ లోకి వెళ్లింది.ఇక తొలి స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ ఆ ఈజీ క్యాచ్‌ను మొదట అందుకున్నట్లు కనిపించినా.చివరికి మాత్రం బంతి చేతుల మధ్య నుంచి జారిపోయింది.
దింతో ఈ ఘటనను చూసి భారత ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.రోహిత్ క్యాచ్ మిస్ చేయడంతో అక్షర్ నిరాశకు గురయ్యాడు.అయితే, వెంటనే రోహిత్ అక్షర్‌కు సారీ చెప్పాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇక 30 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది.తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న జాకీర్ అలీ 40 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.
ఇక ఆ తర్వాత కూడా జాకీర్‌కు మరో రెండు లైఫ్‌లను భారత ఫీల్డర్లు ఇచ్చారు.భారత బౌలర్లలో ఇప్పటివరకు అక్షర్ పటేల్, మహ్మద్ షమీ తలా రెండు వికెట్లు సాధించగా, హర్షిత్ రాణా ఒక వికెట్ తీసాడు.
మొత్తం మీద రోహిత్ క్యాచ్ డ్రాప్ చేయడం అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ కోల్పోవడానికి కారణమైంది.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.