తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.ఇక ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని కలిగి ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) లాంటి హీరో సైతం ఇప్పుడు అడపాదడపా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.రాజకీయంగా ఆయన ముందు వరుసలో నిలబడ్డాడు.
కాబట్టి సినిమాలు చేసే అవకాశం అయితే రావడం లేదు.డిప్యూటీ సీఎంగా (Deputy CM)తన పదవీ బాధ్యతలను కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ తొందర్లోనే హరి హర వీరమల్లు ఓజి సినిమాలను రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడు…

ఇక ఇదిలా ఉంటే తనకు అవకాశం ఉంటే సుభాష్ చంద్రబోస్(Subhash Chandra Bose) జీవిత కథ ఆధారంగా ఒక సినిమాని కూడా చేయాలని చూస్తున్నారట.పవన్ కళ్యాణ్ కి ఆయన పాత్ర అంటే చాలా ఇష్టం అందుకోసమని తన పాత్ర చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాడట.మరి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్టు గా క్యారెక్టర్ ను తను పోషిస్తూ సినిమాని చేసే సమయం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా ముందుగా సెట్స్ మీద ఉన్న సినిమాలను ఫినిష్ చేసిన తర్వాత మిగతా సినిమాలకు కమిట్ అవ్వాలని చూస్తున్నాడు.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సినిమాలు చేస్తున్నాడు.అనుకున్నట్టుగానే వరుస సినిమాలను చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజి (Pawan Kalyan OG)సినిమాతో భారీ విజయాన్ని సాధించాలని చూస్తున్నాడు.మరి తను అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే…
.