ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే భారీ బడ్జెట్ తో సినిమాలను చేయడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా సంపాదించుకోవడంలో దర్శకులు చాలా వరకు ఉత్సాహం చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం అజయ్ భూపతి( Ajay Bhupathi ) లాంటి దర్శకుడు సైతం ప్రస్తుతం స్టార్ డమ్ ను అందుకోవడంలో చాలావరకు ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు.

ప్రస్తుతం ఆయన తెలుగు హీరోలతో కాకుండా ఇతర భాషల హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.ఎందుకంటే ఆయన రాసుకున్న సినిమా స్టోరీలను మన హీరోలు రిజక్ట్ చేస్తున్నారు.తద్వారా ఇతర భాషల హీరోలను నమ్ముకోవడమే బెటరని తను ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.ఇంతకుముందు వెంకీ అట్లూరి ( Venky Atluri )చెప్పిన కథలను కూడా మన హీరోలు రిజెక్ట్ చేయడంతో ఇతర భాషల హీరోలతో సినిమాలను చేసి సక్సెస్ లను సాధించాడు.

మరి ఈయన కూడా అదే బాటలో నడుస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకోవడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యాడు.ఇక అదే రీతిలో ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకొని స్టార్ట్ డైరెక్టర్ ( Start Director )గా ఎదిగాలనే ప్రయత్నం చేస్తున్నాడు.మరి తను అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… తనకంటూ ఒక ఐడియాలజీ ఉంది.దాన్ని బేస్ చేసుకొని ఆయన సినిమాలను చేస్తూ ఉంటాడు అంతే తప్ప హీరోల కోసం స్టోరీలను రాయలేనని చెప్పిన దర్శకుడు కూడా ఈయనే కావడం విశేషం…ఇక ఇప్పుడు ఆయన ఏ హీరోతో చేస్తున్నాడు అనేది క్లారిటీ లేదు కానీ ఇతర భాషల హీరోలతో చేసి సక్సెస్ కొట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…