సినిమా పరిశ్రమలో వరుసగా రెండు మూడు హిట్లు పడితే సదరు హీరోలు, లేదంటే హీరోయిన్లు తమ రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తారు.వరుస అవకాశాలు దక్కించుకుంటూనే భారీగా డబ్బు డిమాండ్ చేస్తారు.
అయితే ఒక్కోసారి ఆయా తారలు అడిగే పారితోషకం ఇవ్వలేక.వేరే నటీనటులను తీసుకున్న సందర్భాలున్నాయి.
రెమ్యునరేషన్ విషయంలో తేడా వచ్చి పలువురు స్టార్స్ మంచి అవకాశాలను వదులుకున్న సందర్భాలున్నాయి.ఇంతకీ ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి.
మంచి ఛాన్సులను మిస్ చేసుకున్న స్టార్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
*శ్రీదేవి
బాహుబలి సినిమా ఏ రేంజిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ శివగామి.ఈ పాత్ర చేయాలని శ్రీదేవిని కోరాడట రాజమౌళి.
తను ఎక్కువ రెమ్యునరేషన్ అడగడంతో రమ్యకృష్ణను తీసుకున్నారట.
*కరీనా కపూర్
కరణ్ జోహార్ నిర్మాణంలో వచ్చిన కల్ హోనా హో సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది.ఈ సినిమాలో కరీనాను హీరోయిన్ గా అనుకున్నారు.అయితే తను ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడంతో తన ప్లేస్ లో ప్రీతి జింటాను తీసుకున్నారట.
*షారుక్ ఖాన్
దీపికా పదుకొనే కీరోల్ చేసిన పద్మావత్ సినిమాలో స్పెషల్ రోల్ కోసం షారుఖ్ ఖాన్ ను అడిగారట.కానీ తను 90 కోట్లు అడిగాడట.దీంతో తనను కాదని మరో హీరోను తీసుకున్నారట.
*సోనాక్షి సిన్హా
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కిక్ సినిమాలో సోనాక్షి సిన్హాను హీరోయిన్ గా తీసుకోవాలి అనుకున్నారట.అయితే ఈ అమ్మడు ఊహించని రీతిలో రెమ్యునరేషన్ అడిగిందట.దీంతో తనను కాదని జాక్వలిన్ ఫెర్నాండెజ్ ను ఓకే చేశారు.
*మాధవన్
ఐశ్వర్యారాయ్ కీ రోల్ చేస్తున్న సినిమాలో ఓ ప్రధాన పాత్రకు తనను అడిగారట.తను ఎక్కువ రెమ్యునరేషన్ అడగడంతో ఆయనను తీసుకోలేదట.
*మాధురి దీక్షిత్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఒకప్పుడు ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు అడిగిందట.దీంతో చాలా సినిమా అవకాశాలను తను కోల్పోయిందట.
*నవాజుద్దీన్ సిద్ధిఖి
అక్షయ్ హీరోగా చేసిన జానీ ఎల్.ఎల్.బి మూవీ మంచి హిట్ అయ్యింది.ఇందులో తనను కీలక పాత్ర కోసం అడిగారట.అయితే తను రూ.3 కోట్లు డిమాండ్ చేశాడట.దీంతో తనను వద్దనుకున్నారట నిర్మాతలు.