1.సిఐడి పై లోకేష్ కామెంట్స్
జగన్ రెడ్డి పాలనలో సిఐడి పేరు క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ డిపార్ట్మెంట్ గా మార్చేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.
2.వెయ్యి కేజీల భారీ కేక్ కటింగ్
విజయవాడ పున్నమి ఘాట్ వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా 1000 కేజీల భారీ కేక్ కటింగ్ ను ఏర్పాటు చేశారు.
3.టీచర్ల వ్యవహారంపై బండి సంజయ్ కామెంట్స్
జీవో 317 కు వ్యతిరేకంగా బిజెపి ఉద్యమానికి సిద్ధమవుతుందని, స్వరాష్ట్రంలో టీచర్లు పరాయి బతుకు బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
4.లోకేష్ పాదయాత్ర పై అచ్చెన్న నాయుడు కామెంట్స్
లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా పాదయాత్ర జరుగుతుందని టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్న నాయుడు అన్నారు.
5.సిఆర్డిఏ కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన
దళిత జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో సి ఆర్ డి ఏ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు.
6.లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపిన విజయ్ సాయి రెడ్డి
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
7.శ్రీ ఆదిత్య హోమ్స్ లో ముగిసిన ఐటీ సోదాలు
హైదరాబాద్లోని శ్రీ ఆదిత్య హోమ్స్ లో ఐటీ సోదాలు మూసాయి.నాలుగు రోజులు పాటు సోదాలు కొనసాగాయి.నిన్న సాయంత్రం శ్రీ ఆదిత్య హోమ్స్ డైరెక్టర్ ల నుంచి అనుమానస్పద లావాదేవీల వివరాలు పై అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.
8.25న తిరుమలకు లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 25న రాత్రి తిరుమలకు రానున్నారు.
9.సినీ తారల టీ టి20 మ్యాచ్
మాదక ద్రవ్యాలు వద్దు అన్న నినాదంతో క్రషెంట్ క్రికెట్ కప్ ( సి సి సీ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26న హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ సినీ తారల టి20 మ్యాచ్ నిర్వహించనున్నారు.
10.టిఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి విమర్శలు
టిఆర్ఎస్ పార్టీని బంధ పెడితేనే రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుందని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు.
11.బెంగళూరులో పాక్ యువతి అరెస్ట్
నకిలీ పత్రాలు సృష్టించి బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న పాకిస్తాన్ దేశ టీనేజ్ యువతని పోలీసులు అరెస్ట్ చేశారు.
12.వేమూరులో నక్క ఆనందబాబు పాదయాత్ర
బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో మాజీమంత్రి నత్త ఆనందబాబు పాదయాత్ర చేపట్టారు.లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా ఆనందబాబు పాదయాత్ర ను చేపట్టారు.
13.హంటర్ పబ్ పై కేసు నమోదు
ఎలాంటి అనుమతులు లేకుండా అధిక డెసిబుల్ సౌండ్ లు, భారీ లైట్ల వెలుతురు లో సంగీతంతో హోరెత్తిస్తున్న ఎస్ ఆర్ నగర్ లోని హంటర్ బార్ నిర్వాహకుడు కృష్ణ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
14.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.స్వామివారి దర్శనం కోసం నేడు రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
15.ఐఐఎం ఆర్ కు బెస్ట్ ఇన్స్టిట్యూట్ అవార్డ్
రాజెంద్ర నగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ కు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు లభించాయి.
16.జీవో నంబర్ 317 ను రద్దు చేయండి
బదిలీల అంశంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.స్థానికత ఆధారంగా బదిలీలు చేపట్టాలని కోరుతూ ఉపాధ్యాయులు తమ పిల్లలతో కలిసి ఆందోళన చేపట్టారు.
17.ఐటీ లే ఆప్స్ పై కేంద్రానికి కేజ్రీవాల్ విజ్ఞప్తి
ప్రపంచ వ్యాప్తంగా పలు టెక్ కంపెనీలు ఉద్యోగులను తీసివేస్తున్నాయి.ఈ పరిస్థితిని సమీక్షించి కేంద్రం చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్ కోరారు.
18.తిరుమల లో యాంటీ డ్రోన్ టెక్నాలజీ
తిరుమల లో యాంటీ డ్రోన్ టెక్నాలజీ ప్రవేశపెట్టనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
19.ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గడువు పెంపు
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం గడువు పెంచింది.ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ గడువు మరో పది సంవత్సరాలు పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,350
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 57,110
.