దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని అంటున్న గ్లామర్ హీరోయిన్ శృతి హాసన్

సంక్రాంతి పండుగ వచ్చింది అంటే నే ప్రతి నిర్మాత స్టార్ హీరో , పెద్ద సినిమా చిన్న సినిమా అనే తేడా లేకుండా ఇండస్ట్రీ అంతా కలిసి ఒక్కటై అందరి సినిమాలు సూపర్ హిట్ అవ్వాలి అని కోరుకుంటారు .మరి ఈ సంక్రాంతి బరిలో మెగా స్టార్ చిరంజీవి , నందమూరి బాలకృష్ణ ఇద్దరు ఒకేసారి తమతమ సినిమాలతో బరిలో దిగారు .

 Sruthi Hasan Remuneration Details For Waltair Veerayya And Veera Simha Reddy ,-TeluguStop.com

ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్య గా, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించారు.ఇక అసలు విషయానికి వస్తే ఈ రెండు మూవీస్ కు చాలా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

రెండు సినిమాలని కూడా ఒక నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం మరో విశేషం.ఇక ఈ రెండు సినిమాల డైరెక్టర్స్ కి దర్శకులుగా మొదట లైఫ్ ఇచ్చింది మాస్ మహారాజ్ రవితేజనే అని పలు సందర్బాల్లో ఈ దర్శకులు తెలియజేసారు .ఇక సీనియర్ హీరో అయిన మెగా స్టార్ చిరంజీవి, అలానే నందమూరి బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటించడం అనేది మరో ఆసక్తికరమైన విషయం.

ఇక వాస్తవానికి వస్తే.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో గ్లామర్ హీరోయిన్ శృతి హాసన్ కు ఇరన్ లెగ్ అనే టాగ్ ఉంది .ఇక తాను గతంలో చేసిన మూవీస్ ఏవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించనంత స్థాయి లో విజయం అందుకోలేకపోయాయి .ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ కి డాన్ శ్రీను మూవీ ద్వారా పరిచయము అయిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని కూడా తన మొదటి మూవీ లో మాస్ మహారాజ్ రవితేజ సరసన గ్లామర్ హీరోయిన్ శృతి హాసన్ ని ఎంపిక చేసుకున్నారు ,అలానే బలుపు , క్రాక్ మూవీస్ లో కూడా హీరోయిన్ గా శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు , ఇక రీసెంట్ గా వీరసింహారెడ్డి మూవీ లో కూడా నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది ,ఇక ఈ సినిమా విజయోత్సవ వేడుకుల్లో నా లక్కీ హీరోయిన్ శృతి హాసన్ ఈ మూవీ లో నటించడం చాలా లక్ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెలిపారు .ఇక చిరంజీవి సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది.

Telugu Salaar, Balakrishna, Chiranjeevi, Prabhas, Sruthi Hasan-Movie

ఇక ఈ క్రమంలో ఈ రెండు సినిమాలకు కలిపి శృతి హాసన్ కు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు అనే టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .ఇక టాలీవుడ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు.ఈ రెండు సినిమాలకు కలిపి ఒకే ఎమౌంట్ కు శృతిహాసన్ ని మాట్లాడుకున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమౌతుంది .సక్సెస్ ఫుల్ బ్యానర్ సీనియర్ హీరోస్ ,టాలెంటెడ్ డైరెక్టర్స్ .గోల్డెన్ ఛాన్స్ ఇలా అదృష్టం తలుపు తట్టితే రెమ్యూనరేషన్ ఎక్కువ తీసుకోవడం తప్పు ఏమి లేదు .సీనియర్ హీరోల ప్రక్కన చేయాల్సి రావటంతో శృతి హాసన్ కు అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చారని బయట చెప్పుకుంటున్నారు.అయితే శృతి కూడా డిమాండ్ చేసే పొజీషన్ లో లేదు.

Telugu Salaar, Balakrishna, Chiranjeevi, Prabhas, Sruthi Hasan-Movie

ఇక ఈ రెండు సినిమాలకు గాను హీరోయిన్ శృతి హాసన్ 5 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు అని తెలుస్తోంది.క్రాక్ సినిమా హిట్ తో లైమ్ లైట్ లోకి వచ్చిన శృతి హాసన్ కు వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి , ప్రస్తుతం శృతి హాసన్ డార్లింగ్ ప్రభాస్ తో సలార్ అనే మూవీ లో నటిస్తుంది .ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అనే సామెత అందరికి తెలిసిందే .ప్రస్తుతం గ్లామర్ హీరోయిన్ శృతి హాసన్ చేసే పని కూడా ఇదే ,అలానే సినిమా హిట్ అయితే రెమ్యూనరేషన్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది, అలానే సినిమా ప్లాప్ అయితే మల్లి రెమ్యూనిరేషన్ తగ్గిపోతుంది .మరి మొత్తానికి శృతి హాసన్ నటించిన వాల్తేరు వీరయ్య , వీరసింహారెడ్డి సినిమాలకు నిర్మాతలు ఎంత పే చేసిన అనే విషయం గురుంచి సోషల్ మీడియా లో అంతలా డిస్కస్ చేయనక్కర్లేదు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube