మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ఖమ్మం జిల్లా ఇల్లందులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ అధికారం లేకున్నా ప్రజల కోసమే పని చేసినట్లు చెప్పారు.ప్రజలే దేవుళ్లన్న ఆయన వారి కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు.
తన దారి ఏంటో తెలియదని, కానీ అభిమానులకు మాత్రం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వెల్లడించారు.మనల్ని ఇంకా రెండు, మూడు నెలల పాటు ఇబ్బంది పెడతారన్నారు.
రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని పొంగులేటి స్పష్టం చేశారు.







