యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు.
సినిమా రాబోతుంది అంటూ వార్తలు వచ్చిన సమయం లోనే ప్రభాస్ అభిమానులు మారుతికి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు.అందుకే ప్రభాస్ అభిమానులు ఆశ్చర్యపోయే విధంగా సినిమా కు సంబంధించిన అప్డేట్ ఇవ్వాలని, అలాగే పోస్టర్, టీజర్ ఉండాలని మారుతి భావిస్తున్నాడట.

ఎవరైతే విమర్శించారో వారితోనే ప్రశంసలు పొందాలని మారుతి చాలా కష్టపడి ప్రభాస్ తో సినిమా ను చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.వచ్చే ఏడాది జనవరి లో సంక్రాంతి కానుకగా ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.
ఇక ఈ సినిమా నుండి రాబోతున్న అప్డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అభిమానుల ఎదురు చూపులకు తగ్గట్లుగానే కచ్చితంగా సాలిడ్ అద్భుతమైన సర్ప్రైజింగ్ అప్డేట్ ని ఇవ్వబోతున్నట్లు దర్శకుడు మారుతి సన్నిహితుల వద్ద పేర్కొన్నాడట.
ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.ఫస్ట్ లుక్ లేదా టీజర్ వచ్చిన తర్వాత మారుతి దర్శకత్వం లో ప్రభాస్ నటిస్తున్న సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తారని కూడా ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

మొత్తానికి మారుతి దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా తో మాత్రమే కాకుండా ముందు ముందు మరిన్ని సినిమా లతో కూడా ప్రభాస్ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.ఆ సినిమా ల్లో ఏ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటాయి అనేది చూడాలి. ప్రభాస్ మరియు మారుతి కాంబో మూవీకి సంబంధించిన అప్డేట్ రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.అది మిస్ అయితే ఉగాదికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







