ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే టీ లేదా కాఫీని సేవిస్తూ ఉంటారు.అలాగే టీ, కాఫీలు ఏవి తాగినా అందులో కాస్త పంచదార, లేదా బెల్లం( Jaggery ) వేసుకోవడం చాలా మందికి అలవాటు ఉంటుంది.
అయితే డయాబెటిస్ పేషెంట్లు మాత్రం పంచదారని ఉపయోగించడానికి భయపడుతూ ఉంటారు.దీని వల్ల టీ, కాఫీలు సేవించలేరు.
అయితే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచే అద్భుతమైన ఒకటి ఉంది.దీన్ని క్రమం తప్పకుండా తాగితే రక్తంలో చక్కెర శాతం పెరగదు.
ఎప్పుడూ అదుపులోనే ఉంటుంది.అయితే ఈ టీ తాగే వారి సంఖ్య తక్కువే.

ఆయుర్వేదంలో కూడా ఈ టీ అత్యంత ఆరోగ్యకరమైనదని చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే క్రమం తప్పకుండా జామ ఆకుతో తయారు చేసిన టీ తాగడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యంగా ఉండవచ్చు.చలికాలం వచ్చిందంటే డయాబెటిస్( Diabetes ) రోగులలో చక్కర స్థాయిలో హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి.ఇన్సూరెన్స్ స్థాయిలను నిర్వహించడం కూడా కష్టంగా మారుతుంది.అది జామ ఆకుతో టీ చేసుకుని తాగితే ఇన్సులిన్ నియంత్రణలో ఉండడంతో పాటు షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.చలికాలంలో దొరికే పండ్లలో జామకాయ ఒకటి.

ముఖ్యంగా చెప్పాలంటే డయాబెటిస్ లక్షణాలు ఈ ఆకులలో ఎక్కువగా ఉంటాయని కొన్ని అధ్యయనాలలో తెలిసింది.అసలు జామ ఆకుల టీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ ఆకుల టీ నీ తయారు చేసుకోవడం ఎంతో సులభం.ఒక గిన్నెలో గ్లాసు నీళ్లు వేసి జామ ఆకులను అందులో వేయాలి.దాన్ని స్టవ్ మీద పెట్టి ఆ నీటిని బాగా మరిగించాలి.జామా ఆకుల్లోని సారమంతా నీటిలోకి వచ్చేవరకు మరిగించాలి.
స్టవ్ ఆఫ్ చేసి ఆకులను వడకట్టి ఆ నీటిని త్రాగాలి.ఈ జామ ఆకుల టీ రోజుకు రెండుసార్లు తాగడం వల్ల షుగర్ వ్యాధి ఉన్నవారి రక్తంలోని చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
ఇంకా కావాలనుకుంటే ఈ టీ లో అర స్పూన్ తేనెను కలిపి సేవించవచ్చు.