ఆనంద నిలయం అంటే ఏమిటి.. దీని ప్రత్యేకత ఏమిటంటే..?

What Is Ananda Nilayam What Makes It Special, Ananda Nilayam, Sri Venkateswara Swamy, Lord Vishnu, Sri Srinivasadu, Bakthi , Devotional

కలియుగ వైకుంఠంలో కొలువైన శ్రీవారిని వివిధ నామాలతో భక్తులు పిలుస్తూ ఉంటారు.అందులో భక్తులు ఎక్కువగా స్పందించిన నామాలలో ఆనంద నిలయ గోవిందా నామం కూడా ఒకటి.

 What Is Ananda Nilayam What Makes It Special, Ananda Nilayam, Sri Venkateswara S-TeluguStop.com

అసలు ఆనంద నిలయం అంటే ఏమిటి? ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.కలియుగంలో భక్తుల రక్షణార్థం ఇలవైకుంఠంలో శ్రీ వెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swamy ) వెలసినాడు శ్రీహరి.

అచెంచలమైన భక్తి భావంతో భక్తులు ప్రతిరోజు లక్షల సంఖ్యలో తిరుమలకు చేరుకొని ఆనంద నిలయంలో కొలువై శ్రీవారిని దర్శించుకుంటారు.కలియుగవైకుంఠంలో వెలసిన శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి భక్తుల తరలి వచ్చి ఆపదమొక్కులవాడ గోవిందా.

ఆనంద నిలయ గోవిందా.గోవిందా అంటూ స్వామివారిని స్మరిస్తూ ఉంటారు.

ఎన్ని నామాలతో పిలిచిన పలుకుతూ భక్తుల కష్టాలు, కోరికలను శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చి తీర్చుతాడని భక్తులు నమ్ముతారు.

స్వయం వ్యక్తమై వెలసిన ఈ క్షేత్రం భక్తుల పాలిట కల్పతరువు స్వామివారిని దర్శిస్తే సకల పాపాలు తొలగి ముక్తి మార్గం లభిస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.అందుకే శ్రీవారి ఆనంద నిలయం నిత్య కళ్యాణం పచ్చ తోరణం గా ఉంటుంది.శ్రీ శ్రీనివాసుడు అర్చావతారమూర్తిగా కొలువైన దివ్య సన్నిధే ఆనంద నిలయం.

ఆ ఆనంద నిలయానికి భౌతిక రూపమే భౌతిక స్వరూప విమానం.అందువల్ల తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గర్భ గుడి మీద గల సువర్ణమయ నిర్మాణాన్ని ఆనంద నిలయ విమానం అంటారు.

విష్ణుదేవుని( Lord Vishnu ) ఆన మేరకు గరుత్మంతుడు వైకుంఠం నుంచి క్రీడాచలాన్ని భూలోకానికి తీసుకుని వచ్చినట్లు, దానిని సువర్ణముఖి నదికి ఉత్తరం వైపున శేషాచల కొండల్లో ప్రతిష్టించినట్లు ఆ క్రీడాద్రి మీద భూవరాహ స్వామి శ్వేతవరాహకల్పం నుంచి నివసించినట్లు అనేక పురాణాలలో ఉంది.

What Is Ananda Nilayam What Makes It Special, Ananda Nilayam, Sri Venkateswara Swamy, Lord Vishnu, Sri Srinivasadu, Bakthi , Devotional - Telugu Ananda Nilayam, Bhakti, Devotional, Lord Vishnu, Sri Srinivasadu, Srivenkateswara #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube