వేద జ్యోతిష్య శాస్త్రంలో( Astrology ) గ్రహాల గమనం వల్ల అనేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి.అందులో కొన్ని శుభ యోగాలు కాక మరి కొన్ని అశుభ యోగాలు అని నిపుణులు చెబుతున్నారు.
అక్టోబర్ 28వ తేదీన చంద్రుడు బృహస్పతి కలయికతో ఏర్పడే ఖగోళ సంఘటన నేపథ్యంలో గజకేసరి రాజయోగం( Gajakesari Raja Yoga ) ఏర్పడింది.ఈ గజకేసరి రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొచ్చిందని నిపుణులు చెబుతున్నారు.
చంద్రుడు, బృహస్పతి గజకేసరి రాజయోగంతో మొత్తం 12 రాశులు ఏదో ఒక విధంగా ప్రభావితం అవుతాయి.అయితే ఈ రాశుల వారికి మాత్రమే అదృష్టం వరిస్తుందని ఇప్పుడు చెబుతున్నారు.

మూడు రాశుల వారికి గజకేసరి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే అని చెబుతున్నారు.అక్టోబర్ 28వ తేదీన చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు.ఈ సమయంలో మేషరాశిలో బృహస్పతి, చంద్రుడు కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడింది.ముఖ్యంగా చెప్పాలంటే గజకేసరి యోగం వల్ల మేషరాశి ( Aries )వారి జాతకాలకు లబ్ధి జరుగుతుంది.
మేషరాశి జాతకుల వ్యాపారం లాభదాయకంగా మారుతుంది.కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడానికి ఇది అనుకూలమైన సమయం అని చెబుతున్నారు.
మేష రాశి జాతకుల వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది.వివిధ వ్యాపారాల ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు.

అలాగే పిల్లల నుంచి శుభ వార్తలను వింటారు.ఇంకా చెప్పాలంటే మిధున రాశి( Gemini ) వారికి గజకేసరి రాజయోగం అదృష్టాన్ని తెస్తుంది.వీరు వ్యాపారాలలో విపరీతమైన లాభాలను పొందుతారు.కొత్త వ్యాపార భాగస్వాములకు సరైన అవకాశం ఏర్పడుతుంది.వృత్తి పరమైన వ్యాపార అవసరాల కారణంగా మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది.ఈ సమయంలో మిధున రాశి వారు శక్తి వంతులుగాను, ఆరోగ్యంగానూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే కర్కాటక రాశి ( Cancer sign )వారికి గజకేసరి రాజయోగం వల్ల బాగా కలిసి వస్తుంది.కర్కాటక రాశి వారు కొత్త పనిని విజయవంతంగా మొదలుపెట్టి లాభాలను పొందుతారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారలు చేసే వారికి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి ఇది ఆర్థికంగా ప్రయోజనాలను( Financial benefits ) చేకూరుస్తుంది.జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు.