హీరో దుల్కర్ సల్మాన్,మృణాల్ ఠాకూర్ తాజాగా జంటగా నటించిన చిత్రం సీతారామం. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మా అందరికీ తెలిసిందే.
హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక ముందన కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఇండియన్ ఆర్మీ, ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది.
అంతేగాకుండా ఈ సినిమా విడుదల అయ్యి సినిమా అంటే ఇలా ఉండాలి అన్న విధంగా కూడా టాక్ ని తెచ్చుకుంది.
ఇకపోతే ఈ సినిమాలో సీతా మహాలక్ష్మిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్.
ఇందులో తన నటన,అందానికి, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇక ఈ సినిమాతో ఆమెకు టాలీవుడ్ లో భారీగా డిమాండ్ ఏర్పడింది.
ఇకపోతే సీతారామం సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్ కు వరసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.తాజాగా వైజయంతి బ్యానర్ లో మరొక సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ ముద్దుగుమ్మ.
కాగా ఈమెకు తెలుగులో బాగా డిమాండ్ పెరగడంత భారీగా రెమ్యునరేషన్ పెంచింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే పెద్ద ప్రొడక్షన్ అయిన వైజయంతి బ్యానర్లోనే ఆమె రెండవ సినిమాలు చేస్తుండటం విశేషం.ఇందుకోసం మృణాల్ ఠాకూర్ కోటీ రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో మొదటి సినిమా తరువాత ఈ రెంజ్‌లో డిమాండ్ చేయడం ఏంటని దర్శక,నిర్మాతలు అవాక్కవుతున్నారట.
కాగా మృణాల్ మొదత టీవీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.మరాఠిలో పలు టీవీ సీరియల్స్‌లో నటించిన ఆమె ఆ తర్వాత బాలీవుడ్ చిన్ని చిన్న సినిమాలు చేస్తూ వెండితెరపై నటిగా ఎదిగింది.
ఈ క్రమంలో ఆమె హిందీ జెర్సీలో హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసింది.