టాలీవుడ్ లో రోజుకి ఒక కొత్త దర్శకుడు పుట్టుకు వస్తున్నాడు.కొత్త కొత్త కథలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
అలా వచ్చిన దర్శకుడు కొరటాల శివ.అయితే మొదట్లో కొరటాల రచయితగా పనిచేసి తర్వాత డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు.ఇంతకు ముందు వరకు చాలా మంది సినీ రచయితలు దర్శకులుగా మారిన దాఖలాలు ఉన్నాయి.కానీ అతి తక్కువ మంది మాత్రమే రచయిత నుండి దర్శకుడిగా సక్సెస అయ్యారు.
వారిలో కొరటాల శివ ఒకరు కావడం గమనార్హం.ఈయన మొదటి సినిమానే టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో అవకాశం దక్కించుకున్నాడు.
కొరటాల మిర్చి తో పక్కా మాస్ యాక్షన్ మూవీని ప్రేక్షకులకు అందించాడు.ఈ సినిమా అటు డైరెక్టర్ కు మరియు ప్రభాస్ కు మంచి పేరును తీసుకు వచ్చింది.

ఇందులో ప్రభాస్ నటన, కొరటాల టేకింగ్, సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.మొదటి సినిమా విజయంతో టాలీవుడ్ లో నిర్మాతలు ఇతనితో సినిమాలు తీయడానికి ఆసక్తి చూపించారు.ఈ సినిమా ఇచ్చిన విజయంతో కొరటాలపై ప్రేక్షకులలో అంచనాలు పెరిగిపోయాయి.ఈ సారి ఎటువంటి సినిమాను తీస్తాడు అన్న ఆతురత ప్రజలలో నెలకొంది.పుట్టిన ఊరి కోసం ఏదో ఒకటి చేయాలి అన్న మంచి కంటెంట్ తో శ్రీమంతుడు సినిమాను తీశాడు.ఇది కూడా దేశవ్యాప్తంగా అందరి హృదయాలను కదిలించింది.
హ్యాట్రిక్ సినిమాగా జూనియర్ ఎన్టీఆర్ తో “జనతా గ్యారేజ్” ను తెరకెక్కించారు.ఈ సినిమా కూడా మంచి సామాజిక బాధ్యతతో కూడిన చిత్రంగా అందరినీ మెప్పించింది.
ఇందులో ఎన్టీఆర్, మోహన్ లాల్, సమంత మరియు నిత్యామీనన్ లు ప్రధాన పాత్రలు పోషించారు.

కొరటాల టేకింగ్ కు ఫిదా అయిన మహేష్ బాబు మరోసారి “భరత్ అనే నేను” సినిమాను చేశాడు.ఇందులో రాజకీయంలో ఉన్న లొసుగులను మరియు ప్రజాప్రతినిధి యొక్క బాధ్యతను ప్రజలకు తెలియచేయడంలో సక్సెస్ అయ్యాడు కొరటాల.ఈ సినిమాలో మహేష్ సరసన శృతి హాసన్ నటించి మెప్పించింది.
ఇలా వరుసగా నాలుగు సినిమాలు హిట్ సాధించి రికార్డు సాధించాడు.ఇప్పుడు ఆచార్య తో ఈనెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఇందులో చిరంజీవి మరియు రామ్ చరణ్ లు నటించిన సంగతి తెలిసిందే.వాస్తవంగా ఎప్పుడూ ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

ఇప్పుడు వరుసగా కొరటాల చేసిన ఈ నాలుగు సినిమాలలో ఒక విషయం మాత్రం కామన్ గా ఉందని వైరల్ అవుతోంది.ఆచార్య ముందు వరకు తీసిన సినిమాలలో ఉన్న హీరోలు అందరూ కూడా బ్యాగ్ ను ధరించి కనిపిస్తారు.ఇప్పుడు ఆచార్యలో సైతం చిరంజీవి ఒక సైడ్ కు బ్యాగ్ వేసుకుని కనిపిస్తున్నాడు.అయితే ఇది తనకు ఒక నమ్మకమా లేదా కథ పరంగా వచ్చిందా అన్నది పక్కన పెడితే… సినిమాలో ఏదో ఒక సందర్భంలో హీరో ఇలా కనిపిస్తున్నాడు.
అందుకే ఆచార్య కూడా హిట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు.మరి దీని ఫలితం ఏమి అవుతుందో చూడాలి.