ఖమ్మం జిల్లా: ఖమ్మం పట్టణంలోని బైపాస్ రోడ్ లో పెళ్లి మండపంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది.2017 నుంచి రజనీని ప్రేమించిన శ్రీనాథ్ మరొక యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు.రజనీ అనే మహిళ పెళ్లి వేడుకలు జరుగుతున్న కళ్యాణ మండపానికి వచ్చి పెళ్ళికొడుకు శ్రీనాథ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మరొక మహిళతో పెళ్లి వేడుకలకు సిద్ధం కావడంతో కల్యాణ మండపానికి వచ్చి తనకు న్యాయం చేయాలంటూ వాపోయింది.
అక్కడే ఉన్న పెళ్ళికొడుకు బంధువులు రజిని పై దాడి చేసి తీవ్రంగా కొట్టి మండపం బయటకు నెట్టేశారు.
రజిని ఖమ్మం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడినుంచి వెళ్ళనుఅంటూ రజిని పెళ్లి మండపం ముందు కూర్చుంది.
సమాచారం అందుకున్న పోలీసులు పెళ్లి మండపానికి చేరుకున్నారు.పోలీసులు వచ్చేలోపు పెళ్ళి జరిగిపోయింది.







