సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సినిమా హీరోయిన్ లేదంటే హీరో నచ్చుతారు.కొంత మంది ఆయా తారలకు అభిమానులుగా ఉంటారు.
సేమ్ ఇలాగే మన సినిమా హీరోలకు కూడా అభిమాన హీరో, హీరోయిన్లు ఉన్నారు.ఇంతకీ మన స్టార్స్ మెచ్చిన సినిమా స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
*చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవికి సీన్ కానరీ అంటే ఇష్టం.చిరంజీవి ఫేవరెట్ హీరోయిన్ మహానటి సావిత్రి.
* నాగార్జున
నాగార్జునకి ఇష్టమైన హీరో అమితాబ్ బచ్చన్, హీరోయిన్ టబు.
*వెంకటేష్
వెంకటేష్ కి ఇష్టమైన హీరోలు మార్లన్ బ్రాండో, రాబర్ట్ రెడ్‌ఫోర్డ్.హీరోయిన్లు శ్రీదేవి, రేవతి, సౌందర్య.
*కమల్ హాసన్
కమల్ హాసన్ ఫేవరెట్ హీరోలు నగేష్, శివాజీ గణేషన్, ఎంజీ రామచంద్రన్, రాజేష్ ఖన్నా.ఇష్టమైన హీరోయిన్స్ శ్రీదేవి, శ్రీ ప్రియ.
*రజనీకాంత్
రజనీకాంత్ ఫేవరెట్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, సిల్వెస్టర్ స్టాలోన్.ఇష్టమైన హీరోయిన్లు రేఖ, హేమమాలిని.
*మహేష్ బాబు
మహేష్ బాబుకి ఇష్టమైన హీరోలు సూపర్ స్టార్ కృష్ణ, కమల్ హాసన్.ఇష్టమైన హీరోయిన్స్ శ్రీదేవి, త్రిష.
*పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ కి ఇష్టమైన హీరోలు అల్ పాసినో, రాబర్ట్ డి నిరో, చిరంజీవి, అమితాబ్ బచ్చన్.ఇష్టమైన హీరోయిన్ మహానటి సావిత్రి.
*ప్రభాస్
ప్రభాస్ కి ఇష్టమైన హీరోలు రాబర్ట్ డి నిరో, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్.ఇష్టమైన హీరోయిన్స్ రవీనా టాండన్, దీపికా పదుకొనె, జయసుధ, త్రిష, శ్రియ.
*రవితేజ
రవితేజకు అమితాబ్ బచ్చన్, గోవిందా, మోహన్ లాల్, చిరంజీవి, రజనీకాంత్ ఇష్టం.ఇష్టమైన హీరోయిన్ తమన్నా.
*నాని
నానికి ఇష్టమైన హీరోలు చిరంజీవి, శోభన్ బాబు, ప్రభాస్, రవితేజ, కమల్ హాసన్.ఇష్టమైన హీరోయిన్లు సావిత్రి, శ్రీదేవి, కీర్తి సురేష్.
*జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ హీరో నందమూరి తారక రామారావు.ఫేవరెట్ హీరోయిన్ సావిత్రి.
* అల్లు అర్జున్
అల్లు అర్జున్ కి ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి.ఇష్టమైన హీరోయిన్ రాణి ముఖర్జీ.
*రామ్ చరణ్
రామ్ చరణ్ ఫేవరెట్ హీరో టామ్ హాంక్స్.ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి.
*అల్లరి నరేష్
అల్లరి నరేష్ ఫేవరేట్ హీరో నాగార్జున.తనకిష్టమైన హీరోయిన్స్ ఆలియా భట్, పరిణీతి చోప్రా.
* సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్ ఫేవరెట్ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రవితేజ, ప్రభాస్.ఇష్టమైన హీరోయిన్ సమంత.