బాలీవుడ్ లో ఇప్పుడు ఈ స్టార్ కపుల్ పెళ్లి గురించే మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.లవ్ బర్డ్స్ గా విహరించి ఇప్పుడు వివాహం ద్వారా ఒక్కటి కాబోతున్నారు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్.
వీరిద్దరూ డిసెంబర్ లో వివాహం చేసుకుంటున్నట్టు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది.అసలు వీరు లవ్ లో ఉన్నట్టే ఇంత వరకు అధికారికంగా బయట పెట్టకుండా ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ వస్తున్నారు.
ఇక పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా ఎన్ని వార్తలు వైరల్ అవుతున్న అలాంటిది ఏమీ లేదు అంటూ మాట దాటేస్తున్నారు.వారు ఇప్పటికి చెప్పక పోయిన కూడా వాళ్ళ పెళ్లిపై మాత్రం వార్తలు ఆగడం లేదు.
తాజాగా వీరి పెళ్లి గురించిన మరొక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.వీరిద్దరూ మీడియాతో వారి పెళ్లి విషయం చెప్పకపోయినా కూడా సన్నిహితుల వద్ద చెప్పడంతో ఇప్పుడు ఆ వార్త బయటకు వచ్చింది.
ఒక వైపు వీరి పెళ్లి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి.ఇప్పటికే పెళ్లి డేట్, వెన్యూ వంటివి ఫిక్స్ చేసారని తెలుస్తుంది.

అయినా కూడా వీరిద్దరూ బయటకు రివీల్ చెయ్యడం లేదు.ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరూ ముందుగా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకో బోతున్నారని తెలుస్తుంది.ముంబై లోని కోర్టులో అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరూ రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకుంటున్నట్టు బయటకు వచ్చింది.

ఇక ఆ తర్వాత వీరిద్దరూ జైపూర్ లో మళ్ళీ భారీ ఎత్తులో వివాహం చేసుకోబోతున్నట్టు చెబుతున్నారు.ఇరు వర్గాల బంధుమిత్రులతో పాటు బాలీవుడ్ కు చెందిన అతి కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం అందినట్టు తెలుస్తుంది.ఇక ఈ స్టార్ కపుల్ అధికారికంగా ప్రకటించక పోయిన కూడా వీరి పెళ్ళికి సంబంధించిన వార్తలు మాత్రం బయటకు రాకుండా ఆగడం లేదు.
మరి పెళ్లి డేట్ అప్పటికి అయినా ఇద్దరిలో ఎవరో ఒకరు నోరు విప్పి అసలు విషయం చెబుతారో లేదో చూడాలి.