ప్రముఖ నటి వైష్ణవి చైతన్య( Vaishnavi Chaitanya ) గురించి కొత్తగా, ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.వైష్ణవి చైతన్య కెరీర్ తొలినాళ్లలో వెబ్ సిరీస్ లు, చిన్నచిన్న పాత్రల్లో నటించగా ఆ పాత్రలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.2023 సంవత్సరంలో విడుదలైన బేబీ సినిమా సక్సెస్ తో వైష్ణవి చైతన్య జీవితం మారిపోయింది.ఈ సినిమాలో వైష్ణవి చైతన్య యాక్టింగ్ కు నెటిజన్లు ఫిదా అయ్యారు.
అయితే జాక్ మూవీ( Jack Movie ) ఈవెంట్ లో వైష్ణవి చైతన్య మ్యాషప్ వీడియో ప్రసారం కాగా యూట్యూబర్ కదా చేయలేదని కొన్ని సినిమాల నుంచి తీసేశారని ఆమె కామెంట్లు చేశారు.ఎన్నో కష్టాలను ఎదుర్కొని తాను ఈ స్థాయికి చేరుకున్నానని వైష్ణవి చైతన్య వెల్లడించారు.
ఒక మూవీ షూటింగ్ సమయంలో తనకు క్యారవాన్ లేదని మరో నటికి క్యారవాన్ ఇవ్వగా అందులోకి తనను అనుమతించకపోవడంతో తాను ఇబ్బంది పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.

ఏదో ఒకరోజు వస్తుందని నేను భావించానని ఆరోజు వచ్చేసిందని వైష్ణవి చైతన్య పేర్కొన్నారు.తాను వీడియోలో భాగంగా చెప్పిన విషయాలను తలచుకుంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు.చిరంజీవి, అల్లు అర్జున్ గతంలో పలు సందర్భాల్లో వైష్ణవి చైతన్యను ప్రశంసించిన సంగతి తెలిసిందే.
వైష్ణవి చైతన్య తన యాక్టింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను మెప్పించారు.

వైష్ణవి చైతన్య నటించిన జాక్ మూవీ నేడు విడుదలైంది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రాలేదు.వైష్ణవి చైతన్య కష్టానికి భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
వైష్ణవి చైతన్య తర్వాత సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.వైష్ణవి చైతన్య రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో సైతం వైష్ణవి చైతన్యకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.