మంచు విష్ణు మా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత స్పీడ్ గా తన పనులు చేసుకుంటూ వెళ్తున్నాడు.ప్రస్తుతం ఆయన సినిమా ల కంటే ఎక్కువ ఆసక్తి ని ఆయన మా పదవి పైనే చూపిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పెద్ద ఎత్తున ఆయన మా ఎన్నికల సందర్బంగా హామీ ఇచ్చాడు.ఆ హామీల కారణంగా నే ఆయన గెలిచాడు అనడంలో సందేహం లేదు.
ప్రతి ఒక్క హామీని కూడా నిలబెట్టుకుంటాను అటూ ఆయన మొదటే ప్రకటించాడు.ఆయన మాట నిలబెట్టుకునేలా ఖచ్చితంగా మోహన్ బాబు చేస్తాడు అనడంలో సందేహం లేదు.
మంచు విష్ణు ఇచ్చిన హామీ ల్లో ప్రథానమైన హామీ ఏంటీ అంటే అది ఖచ్చితంగా మా భవనం అనడంలో సందేహం లేదు.ప్రస్తుతం మా కు లేని భవనం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

సొంతంగా కూడా భవనం కట్టించేందుకు సిద్దం అన్నట్లుగా హామీ ఇచ్చాడు.ఇప్పుడు మంచు విష్ణు ఆ విషయమై కీలక విషయాన్ని ప్రకటిస్తాను అంటున్నాడు.మా సభ్యులు అంతా కోరుకుంటున్న మా భవనం గురించిన ఒకటి రెండు వారాల్లో శుభ వార్త చెప్తాను అంటూ మరో సారి మంచు విష్ణు ఆశ చూపిస్తున్నాడు.ఆయన చెప్తున్న ప్రతి ఒక్క విషయం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఇప్పుడు ఈ విషయం కూడా ఆసక్తిగా ఉంది.రెండు వారాల్లో ఏం చెప్తాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మోహన్ బాబు వారసుడిగా సినిమా ల్లో ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు హీరోగా సక్సెస్ అవ్వలేక పోయాడు.కాని మా అధ్యక్షుడిగా ఆయన మా భవనం కట్టిస్తే మాత్రం ఆయన విజయం సాధించినట్లే అంటున్నారు.
మా భవనం విషయం మళ్ళీ ఎలాంటి రచ్చ చేస్తాయో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.