సాధారణంగా మన ఇంట్లోని పెద్దలు అలాగే అనుభవం ఉన్నవాళ్లు ఎప్పుడైనా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెబుతూ ఉంటారు.రెప్పపాటు కాలంలో తీసుకునే నిర్ణయాలు కొన్ని కొన్ని సార్లు ప్రాణాల మీదకు రావడంతో పాటు జీవితాన్ని తలకిందులు చేసేస్తాయని చెబుతూ ఉంటారు.
చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోవడం.విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేయడం కొన్ని సమయాల్లో హత్యలు చేయడం లాంటి సంఘటనలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
తాజాగా కూడా ఒక వాచ్ మెన్ గొడవ చేయొద్దు అని చెప్పినందుకు అతనిపై దాడి చేసిన మూడవ అంతస్తు నుంచి తోసేశాడు.

ఈ కేసులో సైడ్ డ్యాన్సర్ ని అరెస్ట్ చేశారు పోలీసులు.పూర్తి వివరాల్లోకి వెళితే.టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.
( RRR ) ఈ సినిమాలో చివరి పాట ఎత్తర జెండా( Etthara Jenda ) అనే పాట సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే.ఈ పాటలో సైడ్ డ్యాన్సర్ గా పని చేసిన మణికంఠన్ ని( Manikantan ) బంజారా హిల్స్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
బంజారా హిల్స్ రాఘవ రెసిడెన్సీలో నలుగురు డ్యాన్సర్లతో కలిసి మణికంఠన్ మద్యం సేవించాడు.మద్యం మత్తులో పెద్ద ఎత్తున గొడివ చేయడం మొదలు పెట్టాడు.

కారిడార్ లో గొడవ చేయడం వల్ల అందరికి ఇబ్బంది కలుగుతుందని వాచ్ మెన్ అభ్యంతరం చెప్పాడు.దాంతో కోపంతో ఊగిపోయిన మణికంఠన్ వాచ్ మెన్ ని మూడవ అంతస్తు నుంచి తోసేయడంతో ప్రస్తుతం అతడు చావు బతుకుల మద్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అయితే అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాచ్ మెన్ ని ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం అతని పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకొని మణికంఠన్ తో పాటు మిగతా స్నేహితులను అరెస్ట్ చేశారు.
కాగా, తమిళ ఇండస్ట్రీకి చెందిన మణికంఠన్ కొద్ది కాలంగా టాలీవుడ్ లో సైడ్ డ్యాన్సర్ గా కొనసాగుతున్నాడు.