టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ గతకొంత కాలంగా వరుసబెట్టి చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు.అయినా కూడా ఆయనకు అనుకున్న స్థాయిలో సక్సెస్ మాత్రం దక్కడం లేదు.
దీంతో కంటెంట్ పరంగా వైవిధ్యమైన చిత్రాలను చేసుకుంటూ వెళ్తున్నాడు.ఈ క్రమంలోనే తాజాగా ఆది ‘జంగిల్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.
పూర్తి హార్రర్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కొంతమేర ఆసక్తి నెలకొంది.ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయగా, తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
ఈ టీజర్‌ను పూర్తిగా సస్పెన్స్‌తో కూడిన హార్రర్ అంశాలతో తీర్చిదిద్దారు.‘జంగిల్’లో జరిగే హత్యలకు కారణం ఏమిటా అనే అంశానికి సమాధానం వెతికే ప్రయత్నంలో ఆది ఉంటాడు.
అతడికి తోడుగా హీరోయిన్ వేదిక కూడా ఉంటుంది.ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ‘అది శ్వాసిస్తుంది.
అది దాక్కొని ఉంటుంది.అది వేటాడుతుంది’ అనే క్యాప్షన్ ఈ టీజర్‌పై ఆసక్తిని మరింత పెంచేస్తుంది.
టీజర్‌కు పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయ్యే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఈ టీజర్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.హార్రర్ నేపథ్యంలో ఆది ఇలాంటి సినిమాలో ఇప్పటివరకు నటించలేదని, ఈ సినిమా అతడి కెరీర్‌కు అదిరిపోయే బూస్ట్ ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక ఈ సినిమాను కార్తీక్, విఘ్నేశ్‌లు కలిసి డైరెక్ట్ చేస్తున్నారు.కాగా ఈ సినిమాకు జోస్ ఫ్రాంక్లిన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందని, ఈ టీజర్ బీజీఎం చూస్తే తెలుస్తోంది.
మహేష్ గోవిందరాజ్ నిర్మిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఇక ఈ సినిమాతో ఆది సాయికుమార్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న సక్సెస్ అందుకుంటాడా లేడా అనేది తెలియాలంటే ‘జంగిల్’ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.