నవధాన్యాల్లో ఉలవలు( horse gram ) ఒకటి.వీటి ధర తక్కువే అయినా.
ఉలవల్లో పోషకాలు మాత్రం మెండుగా నిండి ఉంటాయి.అనేక రకాల విటమిన్స్, మినరల్స్ తో పాటు ఫైబర్, ప్రోటీన్ ఇలా ఎన్నో పోషకాలు ఉలవల ద్వారా పొందొచ్చు.
ఉలవలను డైట్ లో చేర్చుకోవడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి సైతం ఉలవలు సహాయపడతాయి.
వయసును దాచేసి చర్మాన్ని యవ్వనంగా మెరిపించడంలో ఉలవలకు మరేదీ సాటి లేదు.ఉలవలను ఇప్పుడు చెప్పబోయే విధంగా పాడితే 60 లోనూ యవ్వనంగా కనిపిస్తారు.
మరి ఇంకెందుకు ఆలస్యం సౌందర్య సాధనలో ఉలవలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక చిన్న కీరా దోసకాయ( Keera Cucumber ) తీసుకుని శుభ్రంగా నీటితో కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఉలవ పిండిని వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ పెసర పిండి( pesara flour ), వన్ టేబుల్ స్పూన్ పెరుగు ( curd )మరియు సరిపడా కీర దోసకాయ జ్యూస్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే మీ చర్మం అందంగా కాంతివంతంగా మారుతుంది.
స్కిన్ టైట్ అవుతుంది.ముడతలు, చారలు, చర్మం సాగడం వంటి వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.వయసు పైబడిన సరే మీ ముఖ చర్మం ఎంతో యంగ్ గా కనిపిస్తుంది.
అలాగే ఈ రెమెడీ వల్ల చర్మం పై మృత కణాలు ఎప్పటికప్పుడు తొలగిపోతాయి.స్కిన్ హెల్తీగా ఉంటుంది.చర్మంపై అధిక ఆయిల్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది.కాబట్టి వయసు పైబడినా సరే యవ్వనంగా మెరిసిపోవాలని భావించేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.