ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.అలా కోరుకోవడంలో ఎలాంటి పోరపాటు లేదు.
అయితే ఆరోగ్యంగా ఉండాలంటే అనేక జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.ఆ జాగ్రత్తల్లో వాకింగ్(నడక) కూడా ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
బరువు తగ్గాలన్నా.భయంకర వ్యాధులకు చెక్ పెట్టాలన్నా.
ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రతి రోజు వాకింగ్ చేయాల్సిందే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.కేవలం ఒక్క అరగంట సేపు వాకింగ్ చేసినా.
ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు.
ప్రతి రోజు ఉదయం ఒక గ్లాస్ వాటర్ తాగి.
అరగంట పాటు వాకింగ్ చేస్తే గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చు.ఇలా చేయడం వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే రిస్క్ కూడా చాలా తక్కువ.
ప్రతి రోజు ఉదయాన్నే నడకను అలవాటు చేసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని అంటున్నారు నిపుణులు.అలాగే రోజుకు ఒక అర గంట నడవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది.
జీర్ణక్రియ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.అదేవిధంగా, డిప్రెషన్‌తో బాధపడేవారికి వాకింగ్ బెస్ట్ మిడిసిన్ అని చెప్పొచ్చు.

ప్రతి రోజు ఒక అరగంట నడవడం వల్ల మెదడులో పిచ్చి ఆలోచనలన్నీ తగ్గి.మామూలు స్థితికి వస్తారు.అలాగే వాకింగ్ చేయడం మరో అద్భుత ప్రయోజనం ఏంటంటే.మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.కాబట్టి, డయాబెటిస్ పేషెంట్లు ప్రతి రోజు ఉదయం ఒక అరగంట వాకింగ్ చేస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మరియు రోజూ వాకింగ్ చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది.