ఈ 5 అలవాట్లు ఉంటే మానుకోండి, లేదంటే చాలా తొందరగా ముసలితనం వచ్చేస్తుంది!

నేటి దైనందిత జీవితంలో రకరకాల ఆహార అలవాట్లు, శారీరక శ్రమ పూర్తిగా లేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మంది నడి వయసులో కూడా ముసలివాళ్ళలాగా కనబడుతూ వుంటారు.దానికి కారణం ప్రధానంగా వారికున్న ఈ 5 అలవాట్లు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 Five Unhealthy Habits That Brings Old Age Fast Details, Bad Habits, Aging Habits-TeluguStop.com

అందులో మొదటిది… కాఫీ,టీలు త్రాగటం.అవును, మనలో చాలా మందికి ఉదయం లేవగానే కాఫీ కానీ టీ కానీ లేకపోతే రోజు గడవని పరిస్థితి.

ఇలా రోజు వీటిని తీసుకోవడం వల్ల, అందులోని కెఫెన్ వయసు మీరకనే వృద్ధాప్య ఛాయలు వచ్చేందుకు దోహదం చేస్తుందని చెబుతున్నారు.

ఈ లిస్టులో రెండవది సీజనల్ ఫ్రూట్స్ తినకపోవడం.అవును, మానవుడు కాలనుగుణంగా పండే పండ్లను కాసిన్ని అయినా తీసుకోవాలి.లేదంటే వృద్యాప్య ఛాయలు తొందరగా వస్తాయని తాజా సర్వేలు చెబుతున్నాయి.

అవును, మీరు తరుచుగా పండ్లు తీసుకోవడం వల్ల, అందులోని పోషకాలు శరీరాన్ని ఆరోగ్యాంగా, అందంగా ఉంచడానికి దోహదపడతాయి.ఇక 3వ దురలవాటు పొగ త్రాగటం.‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అని ఎంత మొత్తుకున్నా మనవాళ్ళు అస్సలు వినరు.పైగా సినిమా థియేటర్లలో సదరు యాడ్స్ వస్తే జోక్స్ వేసుకుంటారు.

ఆ తరువాత భయంకరమైన అలవాటు ఆల్కహాల్ సేవించడం.ఆల్కహాల్ తీసుకొనేవారికి కూడా వృద్యాప్యచాయాలు తొందరగా వచ్చేస్తాయి.ఇందులోని చెడు గుణాలు శరీర జీవక్రియ రేటును తగ్గించి, ఆరోగ్యానికి హాని చేస్తాయి.ఇక చివరగా వ్యాయామం.మనలో చాలామందికి వ్యాయామలు చేయడం అంటే బద్ధకం.పైగా ఈ ఊరుకులు పరుగుల జీవితంలో వ్యాయామం చేయడానికి సమయం లేదని చాలా మంది షాకులు చెబుతూ వుంటారు.

తరుచు వ్యాయామలు చేయడం వల్ల కూడా వృద్యాప్య ఛాయాలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్యానిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube