సమంత ఆరోగ్యంపై అలాంటి వ్యాఖ్యలు చేసిన రానా.. కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో రానా దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ని సంపాదించుకున్నాడు హీరో రానా.

 Rana Daggubati On Samantha Ruth Prabhu Health Condition,rana Daggubati ,samantha-TeluguStop.com

హీరో గానే కాకుండా విలన్ గా కూడా నటించి మెప్పించాడు.హీరో రానా బాహుబలి సినిమా తర్వాత విరాట్ పర్వం సినిమాలో నటించిన అది కాస్త ఊహించిన విధంగా డిజాస్టర్ నిలిచింది.

ఇది ఇలా ఉంటే హీరో రానా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు.ఈ వెబ్ సిరీస్ లో విక్టరీ వెంకటేష్ కూడా కీలకపాత్రలో నటించారు.

Telugu Naga Chaitanya, Rana Daggubati, Rana, Samantha, Samantharuth, Tollywood,

ఈ వెబ్ సిరీస్ మార్చి 10వ తేదీన నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్ కు రీమేక్ గా కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ సంయుక్తంగా తెరకెక్కించారు.ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఈ నేపథ్యంలోనే హీరోయిన్ సమంత ఆరోగ్యం గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇక ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ప్రశ్నిస్తూ.తమ వ్యక్తిగత సమస్య గురించి బహిరంగంగా చెప్పినప్పుడు నటీనటులు ప్రజల గొంతుకగా మారగలరా అని ప్రశ్నించగా.

Telugu Naga Chaitanya, Rana Daggubati, Rana, Samantha, Samantharuth, Tollywood,

రానా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి తమ స్వంత అభిప్రాయం ఉంటుందని.ప్రతి ఒక్కరు దాని గురించి ఎలా మాట్లాడతారు.మిగతవారు మాట్లాడేప్పుడు ఎలా ఉంటుందనేది ముఖ్యం అని తెలిపారు రానా.అయితే సమంత ఆరోగ్య పరిస్థితి గురించి తెలియగానే ఆమెను సంప్రదించాను.మేము ఎప్పుడూ మాట్లాడుకుంటాము.ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి.

ఎవరి జీవితం సాఫీగా ఉండదు.ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేది ఒకటి ఉంటుంది.

అది ఆరోగ్య సమస్య కూడా కావచ్చు.అలాంటి సమయంలో మనం ఎలా వ్యవహరిస్తాము.

దాని గురించి ఎలా స్పందిస్తామనేది.ఈ సమస్యల గురించి అందరూ విచారంగా కూర్చుని మాటాడుకోవాల్సిన అవసరం లేదు.

అప్పుడప్పుడు విచారించే విషయాలు జరగడం కూడా ముఖ్యమే.ఆత్మవిశ్వాసంతో తిరిగి లేచి ముందుకు సాగడమే ముఖ్యం అని చెప్పుకొచ్చారు హీరో రానా.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube