టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో గొప్ప నటులు ఎవరు అని అడిగితే ఎస్వీ రంగారావు( SV Ranga Rao ) పేరు కచ్చితంగా వినిపిస్తుంది.విలన్ అయినా సరే ఆయన నెగిటివ్ పాత్రలలో అద్భుతంగా నటిస్తాడు.
ఆరడుగుల ఎత్తు, గంభీరమైన గొంతు, భయం గొల్పించే హావభావాలతో రంగారావు గొప్ప నటుడికి ఉత్తమ ఉదాహరణగా నిలుస్తాడు.ఒక్క నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలోనే కాదు ఎమోషనల్ పాత్రలలో కూడా ఎస్వీ రంగారావు అద్భుతంగా నటిస్తాడు.మొదటగా నాటక రంగంలో రాణించి ఆ తర్వాత సినిమాల వైపు ఈ నటుడు అడుగులు వేశాడు.15 ఏళ్ల వయసులో ఒక మాంత్రికుడికి అసిస్టెంట్‌గా నటించి మెప్పించాడు.కొన్నేళ్ళకు అదే మాంత్రికుడి పాత్ర చేసే అవకాశం రంగారావుకి లభించింది.
ఆ పాత్రే తనను చరిత్రలో ఒక గొప్ప నటుడిగా నిలబెడుతుందని ఎస్వీ రంగారావు అసలు ఊహించలేదు.
కె.వి.రెడ్డి ఎస్.వి.రంగారావు లో ఓ గొప్ప నటుడిని చూశాడు.అందుకే పాతాళ భైరవి( Patala Bhairavi ) సినిమాలో నేపాల మాంత్రికుడి పాత్రను అతనికే పట్టుబట్టి మరీ ఇచ్చాడు.
ఈ పాత్రను అద్భుతంగా పోషించి విశ్వ నట చక్రవర్తిగా అందరి చేత పిలిపించుకున్నాడు ఎస్వీ రంగారావు.ఇది సినిమాతో ఈ నటుడు తన కెరీర్ లో వెను దిరిగి చూసుకోలేదు.

అయితే ఇంత సక్సెస్ రావడానికి ముందు ఈ నటుడు చాలానే కష్టాలను చవి చూశాడు.కాకినాడలో బీఎస్సీ( B.Sc in Kakinada ) అభ్యసిస్తూ ఉండగా యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్ వారితో కలిసి నాటకాల్లో నటించి తన యాక్టింగ్ స్కిల్స్ పెంచుకున్నాడు.బీఎస్సీ కంప్లీట్ చేశాక ఎమ్మెస్సీ చేయాలని అనుకున్నాడు కానీ ఫైర్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే అవకాశం రావడంతో జాబ్ లో చేరిపోయాడు.
తర్వాత తన సమీప బంధువు నిర్మాణంలో వచ్చిన ‘వరూధిని’ సినిమాలో( Varudhini ) ప్రవరాఖ్యుడి క్యారెక్టర్ చేసే అవకాశం లభించింది.దాంతో ఉద్యోగాన్ని కూడా వెంటనే వదిలేసి షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.
కానీ ఆ మూవీ పెద్దగా ఆడలేదు.మొదటి సినిమా అనే పేరు కావడంతో రంగారావుకి ఎవరూ అవకాశాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు.
దీంతో ఆర్థిక ఇబ్బందులు అతడిని చుట్టుముట్టాయి.చేసేదిలేక మళ్ళీ ఉద్యోగం కోసం అన్వేషణ మొదలుపెట్టాడు.
అలా ప్రయత్నిస్తూ చివరికి జంషెడ్‌పూర్‌లోని టాటా స్టీల్ కంపెనీలో గుమస్తాగా చేరాడు.

అదే సమయంలో మేనమామ కూతురిని పెళ్లి కూడా చేసుకున్నాడు.నేను పెళ్లి చేసుకున్న వేళా విశేషమో ఏమో కానీ ఆ రోజుతో అతనికి మంచి సమయం మొదలయ్యింది.బి.ఎ.సుబ్బారావు ‘పల్లెటూరి పిల్ల’ సినిమాలో విలన్ వేషం ఇప్పిస్తానని పంపించిన టెలిగ్రామ్ రంగారావు అందింది.ఆ సమయంలోనే తండ్రి చనిపోయాడని దుర్వార్త అతను చెవిన పడింది.దాంతో తండ్రి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఉండి ఆ తర్వాత మద్రాసు వెళ్లాడు.కానీ సకాలంలో సినిమా వారిని కలవలేకపోవడంతో ఆ పాత్రను వేరొకరికి ఇచ్చారు.ఆ తర్వాత ఓ చిన్న వేషం వేసే అవకాశం లభించింది అయితే దానివల్ల అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు.
చివరికి షావుకారు సినిమాలో సున్నం రంగడు అనే మంచి పాత్ర ఎస్వీ రంగారావుకి లభించింది.అందులో అతడు చించి పారేశాడు.
ఆ మూవీతో ఎస్వీ రంగారావు అనే ఒక మంచి నటుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నాడన్న సంగతి దర్శకుడు నిర్మాతలకు తెలిసింది.దీని తర్వాత పాతాళభైరవి మంచి బ్రేక్ ఇచ్చింది.