కడప జిల్లాలోని ఉమాశంకర్ రెడ్డి నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ చేశారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉమాశంకర్ రెడ్డి నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.
పులివెందులలో ఉమాశంకర్ రెడ్డి భార్యను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారని తెలుస్తోంది.దుండగులు చేసిన కల్లోలంతో తీవ్ర భయాందోళనకు గురైన ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.







