వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన తరువాత సంక్షేమం పైనే దృష్టి పెట్టారని, అభివృద్ది అంత శూన్యం అనే విమర్శ మొదటి నుంచి కూడా వినిపిస్తుంది.దీనికి కారణం కూడా లేకపోలేదు.
ఎందుకంటే పక్కా రాష్ట్రం అయిన తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న ఇన్వెస్టర్స్.ఏపీ వైపు చూడడానికి మాత్రం వెనుకడుగు వేస్తున్నారని, అసలు పెట్టుబడులను ఆకర్షించడంలో వైఎస్ జగన్ ఘోరంగా విఫలం అయ్యాడని ప్రతిపక్షాల నుంచి వినిపించే విమర్శ.
అయితే వీటన్నిటికి సమాధానంగా ఇటీవల రెండు రోజులు విశాఖలో గ్లోబెల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు నిర్వహించింది ఏపీ సర్కార్.
ఈ సమ్మిట్ తో దిగ్గజ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని, రెండు లక్షల కోట్లు అంచనా వేస్తే.
ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని జగన్ సర్కార్ చెబుతుంది.కేవలం ప్రకటనల వరకే కాకుండా నేరుగా ఏంఓయూలు కూడా జారీ చేసి జగన్ తన మార్క్ బిజినెస్ చూపించడాని వైసీపీ వర్గం చెబుతోంది.
అయితే రెండు రోజులపాటు జరిగిన ఈ గ్లోబెల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సు పెద్దగా ఆకట్టుకోలేదని, ఇదంతా కూడా వైసీపీ చేస్తున్న హంగామా అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.నిజంగా జగన్ మార్క్ బిజెనెస్ అయితే ఈ నాలుగేళ్ల కాలంలో ఎందుకు పెట్టుబడులు రాలేదని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు.

ఇదంతా పక్కన పెడితే ఎట్టకేలకు పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించి ప్రతిపక్షాల నోళ్ళు మూయించే ప్రయత్నం చేసినప్పటికీ.వీటిని వాస్తవ రూపంలోకి తీసుకురావడమే జగన్ సర్కార్ ముందున్న ప్రధానమైన సవాళ్ళు అని విశ్లేషకులు చెబుతున్నారు.ఎందుకంటే ఏపీలో ఎన్నికలకు ఎంతో సమయం లేదు.ఈ ఏడాదిన్నర సమయంలో ఎన్ని కంపెనీలు కార్యరూపం దాల్చే అవకాశం ఉందనేది కూడా చెప్పలేని పరిస్థితి ఒకవేళ వచ్చే ఎన్నికలతో ప్రభుత్వం మారితే ఆయా కంపెనీల ఏంఓయూలు కూడా పెండింగ్ లో పడే అవకాశం లేకపోలేదు.

మొత్తానికి పెట్టుబడుల విషయంలో జగన్ సర్కార్ పై ఉన్న విమర్శలకు చెక్ పెట్టె ప్రయత్నం చేసినప్పటికీ.అసలైన సవాళ్ళు ఇకముందే ఉన్నాయనేది కొందరి అభిప్రాయం.ఏది ఏమైనప్పటికి పెట్టుబడులను ఆకర్షించే విషయంలో తెలంగాణ అడుగు ముందే ఉండగా.మరి ఇప్పుడిప్పుడే ఇన్వెస్టర్స్ ఏపిపై దృష్టి పెట్టిన ఏపీ సర్కార్ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తుందా లేదా కేవలం ప్రకటనల వరకే పరిమితం అవుతుందా అనేది చూడాలి.







