సినిమా పరిశ్రమలో రూమర్స్ అనేవి కామన్.నిత్యం నటీనటులతో పాటు దర్శకులు, నిర్మాతల పైనా జోరుగా రూమర్స్ వస్తుంటాయి.
వాటిలో కొన్ని నిజం కాగా.చాలా వరకు అవాస్తవాలు అయి ఉంటాయి.
తెర ముందు సెలబ్రిటీలతో పాటు తెర వెనుక సెలబ్రిటీలు సైతం ఈ రూమర్స్ తో ఇబ్బంది పడిన వారు చాలా మంది ఉన్నారు.అలా రూమర్స్ దెబ్బకు అల్లాడిన సింగర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
కౌసల్య
చక్రి ఏ సినిమాకు మ్యూజిక్ అందించినా.అందులో కౌసల్య పాటలు పాడాల్సిందే.చక్కటి గాత్రంతో ఎన్నో హిట్ పాటలు పాడింది.అయితే ఆమె కెరీర్ మంచి మలుపు తిరుగుతున్న సమయంలో రూమర్స్ వెంటాడాయి.ఓ పక్క కుటుంబ సమస్యలతో పాటు కెరీర్ లో కూడా అనవసర రూమర్స్ రావడంతో ఆమె చాలా ఇబ్బందులు పడ్డారు.ఫలితంగా సింగర్ గా తన ప్రయాణం నెమ్మదించింది.
ఉష
ఆర్పీ పట్నాయక్ పరిచయం చేసిన ఈ సింగర్ ఎన్నో మధుర గీతాలను ఆలపించింది.కొద్ది కాలంలోనే టాప్ సింగర్ అయ్యింది.అదే సమయంలో ఉష ని రూమర్స్ వెంటాడాయి.వీటిని ఆమె తట్టుకోలేకపోయింది.కెరీర్ కు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంది.
పాప్ సింగర్ స్మిత
పాప్ సింగర్ గా స్మిత ఓ రేంజిలో పాపులారిటీ సంపాదించిందది.తన పాటలతో యూత్ ని కట్టిపడేసింది.అదే సమయంలో ఆమెను రూమర్స్ చుట్టుముట్టాయి.
దీంతో ఆమె కెరీర్ ను కాస్త పక్కకు పెట్టింది.త్వరలో టీవీరంగంలోకి అడుగు పెట్టబోతుంది.
సునీత
సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా అద్భుత పేరు సంపాదించుకుంది సునీత.అయితే ఈమెపై వచ్చినన్ని రూమర్లు మరెవరిపై రాలేదని చెప్పుకోవచ్చు.అయినా తట్టుకుని నిలబడింది.అందుకే కెరీర్ ను కొనసాగిస్తుంది.అటు మరో సింగర్ మాళవిక కూడా తాజాగా తీవ్ర ఆరోపణలకు గురైంది.తన మూలంగానే ఎస్పీ బాలుకి కరోనా వచ్చిందనే ప్రచారం జరిగింది.
అయితే ఈ రూమర్స్ కొట్టిపారేసింది మాళవిక.