హనుమంతుడికి 108 వెండి తమలపాకులతో పూజిస్తే..!

సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఉంటాయి.వ్యాపారంలో ఒడిదుడుకులు, ఉద్యోగంలో ఇబ్బందులు, పెళ్లి విషయంలో ఇబ్బందులు తలెత్తడం వంటివి ఎంతో మందిని ఎన్నో రకాలుగా బాధ పెడుతుంటాయి.

 Tuesday Hanuman Pooja Vidhi Benefits And Vrat With 108 Betel Leaves , Hanuman, P-TeluguStop.com

ఈ విధంగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ముందుగా హనుమంతున్ని పూజిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.ఏడు మంగళవారాలు తప్పకుండా హనుమంతుని ఆలయాన్ని దర్శించి 108 ప్రదక్షిణలు చేసి మన మనసులోని కోరికను స్వామి వారి సన్నిధిలో తెలుపుట వల్ల తప్పకుండా మన కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

భక్తి శ్రద్దలతో స్వామివారిని పూజించడం వల్ల మన జీవితంలో ఏర్పడినటువంటి అంగారక, రాహు, శని వంటి ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయి.అయితే ప్రతి మంగళ శుక్ర శని వారాలలో ఉదయం ఆరు గంటల నుంచి 12 గంటల మధ్య స్వామివారికి వెండి తమలపాకులతో పూజలు చేయటం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

అలాగే సువర్చలా హనుమ కల్యాణం జరిపిస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి.

ప్రతినెలా పూర్వభద్ర నక్షత్రం రోజున స్వామివారికి సువర్చలా హనుమ కల్యాణం జరిపించవచ్చు.ఎంతో ధైర్యశాలి అయిన హనుమంతుడిని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.కనుక భక్తులు కోరిన వెంటనే కోరికలను తీర్చే దయాగుణుడు ఆంజనేయుడు అని చెప్పవచ్చు.

అయితే ఆంజనేయ స్వామికి ప్రతి మంగళ, శుక్ర ,శని వారాలలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి, సుఖ సంతోషాలతో గడుపుతారు.అయితే స్వామివారికి పూజ చేసే సమయంలో ఎర్రటి వస్త్రాలు ధరించి, పూజ సమయంలో స్వామి వారికి ఎర్రటి పుష్పాలను సమర్పిస్తే స్వామివారి అనుగ్రహం మనపై కలిగి మనకు ఎంతో ధైర్యాన్ని ప్రసాదిస్తాడు.

అదేవిధంగా మన జీవితంలో ఏర్పడ్డ కష్టాలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా స్వామివారికి 108 వెండి తమలపాకులతో పూజించడం మర్చిపోకూడదు

Tuesday Hanuman Pooja Vidhi Benefits And Vrat With 108 Betel Leaves , Hanuman, Pooja, 108 Silver, Betel Nut , 108 Betel Leaves, Pooja Vidhi, Tuesday, Friday, Saturday, Silver Betel Leaves, Hanuma Kalyanam - Telugu Betel, Silver, Betel Nut, Friday, Hanuma Kalyanam, Hanuman, Pooja, Pooja Vidhi, Saturday, Silver Betel, Tuesday #Shorts

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube