రోజా అంటేనే రెబల్ ఆమె మాట్లాడితే ఎంతటివారికైనా వెన్నులో వణుకు పుడుతుంది.రాజకీయాల్లోనే కాకుండా సినిమాల్లో కూడా రెబల్ గా ఉండే రోజా కేవలం పది సంవత్సరాల్లోనే వందకు పైగా సినిమాల్లో నటించింది.
అంతేకాకుండా మూడు సార్లు ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది.అటు తెలుగు, తమిళ ప్రేక్షకులను తన నటనతో ఎంతగానో అలరించింది.
తమిళ సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే తమిళంలో అగ్ర దర్శకుడు అయిన సెల్వమణి ని 2002లో ప్రేమించి పెళ్లి చేసుకుంది.ఎన్నో ఏళ్ల పాటు వీరి ప్రేమ నడించింది.
చివరకి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు.
చాలా రోజుల నుంచి రోజా కూతురు కూడా సినిమాల్లో నటిస్తుంది అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూనే బుల్లితెర లో ప్రసారమయ్యే పలు టీవీ షోలలో కూడా నటిస్తోంది రోజా.
అలాగే రోజా పలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గానే ఉంటుంది.అంతే కాకుండా రోజా ఒక నీలి చిత్రంలో నటించింది అని ఇప్పటికీ చాలామంది ప్రేక్షకులు అంటూ ఉంటారు.
కానీ ఆ వ్యాఖ్యలు నిజం కాదని రోజా అన్నారు.
అయితే బయటకి ఎంతో దైర్యంగా, మాస్ గా కనిపించే రోజా జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటనలు, కన్నీళ్లు పెట్టించే సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.
రోజా జీవితంలో జరిగిన అలాంటి ఒక బాధాకరమైన సంఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.రోజా కి ఒక కూతురు మరియు ఒక కుమారుడు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
అందరికి అమ్మల మాదిరిగానే రోజా కూడా తన పిల్లల బాధ్యతను సాధ్యమైనంతవరకు చక్కగానే నిర్వహించుకుంటూ వస్తుంది.అయితే మొదట అమ్మాయి అన్షు మాలిక పుట్టినప్పుడు పెద్దగా ఎలాంటి సమస్యలు లేకపోయినాగాని అబ్బాయి కృష్ణ లోహిత్ సెల్వమణి పుట్టినప్పుడు మాత్రం తీవ్రమైన సమస్యలను ఎదురుకున్నట్లు తెలిపారు రోజా.
తమిళ బుల్లితెరపై ఒకప్పటి హీరోయిన్ సుహాసిని హోస్ట్ గా చేస్తున్న ఒక ప్రోగ్రామ్ కి అతిధిగా వచ్చిన రోజా బాధలను సుహాసిని తో పంచుకున్నారు.
రోజా రెండో సారి గర్భం దాల్చి ఐదు నెలలు నిండకముందే తీవ్ర రక్తస్రావం అయిందట.దానితో డాక్టర్లు అబార్షన్ చేయాలని చెప్పారట.అయితే ఏ తల్లి మాత్రం తన బిడ్డని వదులుకోవడానికి ఇష్ట పడుతుంది చెప్పండి.
రోజా ఎంతటి హీరోయిన్ అయిన గాని అప్పటికే ఒక బిడ్డ కి తల్లి అయింది.మాతృత్వం లోని మాధుర్యాన్ని చవి చూసింది కాబట్టి అబార్షన్ చేయించుకోవడానికి ఇష్టపడలేదు.ఇంకా డాక్టర్లు కూడా చివరికి ఒక ఆలోచన చేశారట.7 నెలలు వస్తే బిడ్డ బతకే అవకాశం ఉంటుందని కావున ఈలోపు అబార్షన్ అవ్వకుండా ఉండాలంటే రెండు నెలలు పాటు కాళ్ళు రెండు పైకి కట్టి పెట్టి ఉంచి, అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకుని ఉంటే బిడ్డ బ్రతికి ప్రమాదం నుంచి బయట పడవచ్చు అని తెలిపారట.డాక్టర్ సలహా మేరకు బిడ్డకి ఏడవ నెల వచ్చే వరకు తన రెండు కాళ్ళని తాళ్లతో పైకి కట్టిపెట్టుకుని ఆసుపత్రిలోనే ఉన్నారట.అలా రెండు నెలల పాటు బాత్రూమ్ కి కూడా వెళ్లకుండా నరక యాతన అనుభవించింది అంట రోజా సెల్వమణి. అలా తన కొడుకుకి జన్మ నిచ్చింది రోజా.9 నెలలు నిండాక కృష్ణ లోహిత్ పుట్టాడు.ఎంతయినా రోజా ఒక మంచి నటి మాత్రమే కాదు.మంచి వక్త, రాజకీయనాయకురాలు అని అనిపించుకోవడమే కాదు ఒక మంచి తల్లిగా కూడా నిరూపించుకుంది.