దత్త జయంతి వృత్తాంతం గురించి తెల్పండి?

అత్రి, అనసూయలు ఋక్షపర్వంతపై తపస్సు చేసి, విష్ణుమూర్తిని తమ తనయుడుగా జనించుమని కోరగా మహా విష్ణువే వారికి జన్మించాడని శ్రీమద్భాగవతం, దేవీ భాగవతం, మార్కండేయాది పురాణాలు తెలియ చేస్తున్నాయి.ఈ దత్తా వతరణ గాథలో విశేష అంతరార్థం ఇమిడి యున్నది.అది భౌతిక, అధిదైవిక, ఆధ్యాత్మికమైన ‘త్రి’విధ పాప, తాపములను జయించి, సాత్విక, రాజస, తామసాహంకారాన్ని (త్రివిధ అహంకారాలను) పార ద్రోలినవాడు కనుక ‘అత్రి’ అని పిలువ బడిన ముని సత్తముడు, అసూయ లేని సాధ్వి ‘అనసూయ’లు సంతానార్థం తపస్సు చేసారు.‘ఋక్ష’ అనగా ‘భల్లూకం’ అని అర్థం.‘పర్వతం’ నిశ్చల స్థితిలో నుండు అచలం భల్లూకపు పట్టు (వదలని దీక్ష) లాంటి నియమ నిష్టలతో, అచంచల తపస్సు చేసినవారికి భగవంతుడు తనకు తానే దత్తుడ అవుతాడన్న భక్తి సిద్దాంతానికి నిదర్శనమే ఈ దత్త స్వామి అవతరణం.ఈ దత్తాత్రేయ ఆవిర్భావం ‘మార్గశీర్ష పూర్ణిమ’ తిథి నాడే కనుక విశేషించి ఆధ్యాత్మిక సాధనలకు, దత్తోపాసనకు మహిమాన్విత ‘దత్త జయంతి’గా ఆచరణీయమైనది.

 Do You Know About Story Of Datta Jayanthi , Datta Jayanthi, Datta Jayanthi Story-TeluguStop.com

దత్త జయంతి రోజున తెల్లవారు జామునే భక్తులు నదీస్నానం లేదా ఏటి స్నానం చేస్తారు.దత్తాత్రేయునికి షోడశోపచారాలతో పూజ చేస్తారు.జప ధ్యానాలకు ఈ రోజు ప్రాముఖ్యం ఇస్తారు.దత్తాత్రేయుని యోగమార్గం అవలంబిస్తామని సంకల్పించుకుంటారు.

దత్త చరిత్ర, గుర చరిత్ర, అవధూత గీత, జీవన్ముక్త గీత, శ్రీపాదవల్లభ చరిత్ర, నృసింహసరస్వతి చరిత్ర, షిర్డి సాయిబాబా చరిత్రం, శ్రీదత్తదర్శనం వంటివి పారాయణ చేస్తారు.ఈ రోజు ఉపవాసం ఉండడం కూడా ఆనవాయితీనే.

సాయం వేళలో భజనలు చేస్తారు.మహబూబ్ నగర్ జిల్లాలోని కురుపురం, తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీపాద వల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు.

అవధూత దత్త పీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్నాయి వాటిలో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube