నందమూరి బాలకృష్ణ ఇప్పుడు వరకు తన కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించిన విషయం తెలిసిందే.ఇక ఇప్పుడు సీనియర్ హీరో అయిన తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు నందమూరి నటసింహం.
అయితే ఇప్పుడు సీనియర్ హీరోగా మారిపోయిన బాలకృష్ణకు హీరోయిన్ లు వెతకడం అటు దర్శకనిర్మాతలకు సవాల్ గా మారిపోయింది.కుర్ర హీరోయిన్లు సీనియర్ హీరోల సరసన నటించేందుకు అంతగా మొగ్గు చూపకపోవడం కారణంగా సీనియర్ హీరోలకు కొన్ని ఆప్షన్లు మాత్రమే ఉంటున్నాయి.
దీంతో చేసిన హీరోయిన్ తోనే మళ్ళీ మళ్ళీ సినిమాలు చేస్తూ ఉన్నారు సీనియర్ హీరోలు.అయితే ఇప్పటి వరకు బాలకృష్ణ ఎంతో మంది హీరోయిన్లతో నటించిన.కాజల్ అగర్వాల్ తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు.అలా అని వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు అనుకుంటే పొరపాటే.
ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కించేందుకు దర్శక నిర్మాతలు రెండుసార్లు ప్లాన్ చేశారు.కానీ అనుకోని కారణాలవల్ల వర్కౌట్ కాలేదట.
బాలయ్య కెరీర్లో వందో చిత్రంగా తెరకెక్కింది గౌతమీపుత్ర శాతకర్ణి. అయితే ఈ సినిమా సమయంలో ఎంతో మంది హీరోయిన్ల పేరు తెరమీదికి రాగా చిత్రబృందం కాజల్ అగర్వాల్ ని సంప్రదించారట.
అయితే ఈ సినిమాలో ఇక ఒక బిడ్డకు తల్లిగా కనిపించాల్సిన పాత్ర చేయాల్సి ఉండటంతో కాజల్ నో చెప్పిందట.
తర్వాత ఈ పాత్ర కోసం శ్రీయాని తీసుకున్నారు.అయితే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే.ఇక నందమూరి బాలకృష్ణ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన పైసా వసూల్ సినిమా లో కూడా శ్రీయా ని రిపీట్ చేసారు అయితే ఈ సినిమా కోసం ముందుగా పూరీ జగన్నాథ్ కాజల్ ని అడిగాడట.
కాజల్ కూడా బాలయ్య తో సినిమా చేయడానికి కాస్త ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.కానీ ఆ సమయంలో మరో సినిమాతో బిజీగా ఉండడంతో చివరికి వదులుకోవాల్సి వచ్చిందట.
ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయిన కాజల్ మళ్ళీ సినిమాల్లోకి వస్తుందో లేదో కూడా తెలియదు అని చెప్పాలి.