కుంభ కర్ణుడు, రావణాసురులు అన్నదమ్ములు అనే విషయం మనందరికీ తెలిసిందే.కానీ వీరి జన్మ రహస్యం ఏమిటో వీరు ఎందుకు రాక్షసులుగా మారారో చాలా మందికి తెలియదు.
విష్ణు భక్తులు అయిన వీరు అసలు ఎందుకు రాక్షసులుగా మారారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీ మహా విష్ణువు వద్ద జయ విజయలు అనే ఇద్దరు ద్వార పాలకులు ఉండేవారు.
ఒకసారి సనత్ కుమారులు మహా విష్ణువు దర్శనం కోసం వస్తారు.వీరు చిన్న పిల్లలు అనుకొని జయ విజయులు వీరిని ఆపేస్తారు.
లోనకి పంపకుండా అడ్డుకుంటారు.ద్వార పాలకులైన జయ విజయుల పనికి కోపోద్రిక్తులైన సనత్ కుమారులు… వీరిని భూ లోకలంలో జన్మించమని శపిస్తారు.
ద్వార పాలకులైన జయ విజయులు విషయాన్ని గ్రహించి శ్రీ మహా విష్ణువును శాప విమోచనాన్ని అడుగుతారు.
ఇందుకు మహా విష్ణువు ఏడు జన్మలు వైష్ణవ భక్తులుగా గాని లేక మూడు జన్మలు మహా విష్ణువుతో వైరంతో జన్మిస్తే శాప విమోచనం జరుగుతుందని చెబుతాడు.
ఇలా జయ విజ యులిద్దరూ మహా విష్ణువుతో మూడు జన్మల్లో వైరం కావాలని కోరు కుంటారు.అలా వీరు కృత యుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్య కశ్యపుడిగా… త్రేతాయుగంలో రావణాసురుడు, కుంభ కర్ణుడిగా… ద్వాపర యుగంలో శిశుపాలుడు, దంతక్తరుడిగా జన్మిస్తారు.ఆ తర్వాత శాపవిమోచనం పొంది మహా విష్ణువు వైకుంఠాన్ని చేరుకుంటారు.నాటి డయ విజయులే త్రేతా యుగంలో రావణాసురుడు, కుంభ కర్ణుడిలా పుట్టి రాముడి చేతిలో హతమొందుతారు.