శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ నెలలో ఎప్పుడు జరుపుకోవాలో తెలుసా..?

పండగలన్నీ తిధుల ఆధారంగా నిర్ణయిస్తారని పండితులు చెబుతున్నారు.ఏ రోజు సూర్యోదయానికి తిథి ఉంటే ఆ రోజునే పరిగణలోకి తీసుకుంటారు.

 Do You Know When To Celebrate Shri Krishna Janmashtami In This Month , Krishna-TeluguStop.com

కానీ కృష్ణాష్టమి విషయంలో గందరగోళం రావడానికి కారణం తిధులు తగులు, మిగులు రావడమే అని చెబుతున్నారు.పంచాంగ కర్తలు ఏ రోజైతే కృష్ణాష్టమి( Krishna Janmashtami ) జరుపుకోవాలని సూచిస్తారో ఆ రోజు సూర్యోదయానికి అష్టమి తిథి( Ashtami Tithi ) లేదు.

మర్నాడు అష్టమి తేదీ ఉంది.దీంతో కృష్ణాష్టమి ఏ రోజు జరుపుకోవాలి అనే గందరగోళం ఏర్పడింది.

ఇంతకీ కృష్ణాష్టమి ఆరవ తేదీన లేక ఏడవ తేదీన జరుపుకోవాల, అంటే ముందుగా తిధుల గురించి తెలుసుకోవాలి.

Telugu Ashtami Tithi, Devotional, Lord Krishna, Ravanamasam, Vasudeva-Latest New

అష్టమి ఘడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే సెప్టెంబర్ 6 సప్తమి బుధవారం రాత్రి 7 గంటల 58 నిమిషముల వరకు ఉంది.ఆ తర్వాత అష్టమి ఘడియలు మొదలవుతాయి.

అలాగే సెప్టెంబర్ 7 అష్టమి గురువారం రాత్రి 7 గంటల 47 నిమిషముల వరకు ఉంటుంది.అంటే సెప్టెంబర్ 6 బుధవారం మధ్యాహ్నం రెండు గంటల 42 నిమిషముల వరకు కృత్తిక నక్షత్రం( Krittika Nakshatra ) ఉంది.

ఆ తర్వాత ప్రారంభమైన రోహిణి నక్షత్రం( Rohini Nakshatra ) సెప్టెంబర్ 7 గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది.సాధారణంగా పుట్టిన రోజులు అన్నీ కూడా సూర్యోదయానికి తిథి ఉండేలా చూసుకుంటారు.

Telugu Ashtami Tithi, Devotional, Lord Krishna, Ravanamasam, Vasudeva-Latest New

ఇంకా చెప్పాలంటే నక్షత్రం ఒక్క రోజు అటు ఇటు ఉన్నా కానీ తిధి ముఖ్యం.అయితే పంచాంగ పంచాంగకర్తలంతా సెప్టెంబర్ 6నే కృష్ణాష్టమి జరుపుకోవాలని సూచిస్తున్నారు.ఎందుకంటే శ్రీకృష్ణుడు( Lord Krishna ) జన్మించింది శ్రావణమాసం బహుళ అష్టమి అర్థరాత్రి సమయంలో అక్కడి నుంచి వాసుదేవుడి( Vasudeva ) ద్వారా గోకులంలో నందుడి ఇంటికి చేరుకున్నది మరుసటి రోజు ఉదయం.అందుకే శ్రీకృష్ణుడు జన్మించిన సమయానికి అష్టమి తిధి ఉండడం ప్రధానం అంటారు.

అయితే వైష్ణవులు మాత్రం సెప్టెంబర్ 7న కృష్ణాష్టమి జరుపుకుంటారు.ఎందుకంటే వారికి రోహిణి నక్షత్రంలో కూడిన అష్టమి ప్రధానం.

ముఖ్యంగా చెప్పాలంటే మిగిలిన వారికి కృష్ణాష్టమి సెప్టెంబర్ 6 బుధవారమే అని చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube