పనస పండు.ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫైబర్, ప్రోటీన్‌తో పాటు శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పనస పండులో మెండుగా ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా ఇది ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.
మరెన్నో జబ్బులను నివారించడంలోనూ సహాయపడుతుంది.అందుకే పనస పండు కనిపిస్తే అస్సలు వదలొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
పనస పండు ఆరోగ్యానికి మంచిదే.కానీ, దాన్ని తిన్న తర్వాత కొన్ని కొన్ని ఫుడ్స్‌ను పొరపాటున కూడా తీసుకోరాదు.
మరి ఆ ఫుడ్స్ ఏంటీ.? పనస పండు తిన్న తర్వాత ఎందుకు వాటిని తీసుకోరాదు.? వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు ఎన్ని ఆరోగ్య లాభాలను అందిస్తుందో వివరించాల్సిన పని లేదు.
అయితే పనస పండును తిన్న వెంటనే పాలను ఎట్టిపరిస్థితుల్లో తీసుకోరాదు.ఆ రెండిటినీ ఒకేసారి తీసుకోవడం వల్ల దురదలు, రింగ్‌వార్మ్స్, సోరియాసిస్ వంటి రకరకాల చర్మ సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది.
కాబట్టి, పనస పండు తిన్న వెంటనే పాలు, పాలతో తయారు చేసే ఆహారాలకు దూరంగా ఉండండి.
పనస పండు తిన్న వెంటనే తీసుకోకూడని ఆహారాల్లో బొప్పాయి ఒకటి.
ఈ రెండిటి కలయిక శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అలాగే పనస పండుకు తేనెను కలిపి తీసుకోవడం లేదా పనస పండు తిన్న తర్వాత తేనె తీసుకోవడం వంటివి పొరపాటున కూడా చేయరాదు.ఒకేసారి పనస పండు, తేనె తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి.ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.కాబట్టి, జాగ్రత్తగా ఉండండి.
.