ద్వాదోష జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో త్వరలో పూజలు నిర్వహించనున్న అర్చకులు ఇప్పటి నుంచి డ్రెస్ కోడ్ లో కనిపిస్తారు.ఎలాంటి రుసుము లేకుండా దేవాలయ నిర్వాహకులు అర్చకులు అందరికీ దుస్తులను ఏర్పాటు చేస్తున్నారు.
దీని వల్ల దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులు దేవాలయంలో నియమించబడిన భద్రత సిబ్బంది, సాధారణ సిబ్బంది వారిని సులభంగా గుర్తించగలుగుతారు.శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయ ట్రస్ట్ కౌన్సిల్ కూడా ఇందుకు ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం.
రాబోయే రోజులలో ఆలయ పూజారులు ధోతీ కుర్తాతో ప్రత్యేక దుపట్టాలో కనిపిస్తారని వారణాసి కమిషనర్ కౌశల్ రాజ్ శర్మ వెల్లడించారు.వారి కోసం డ్రెస్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
అయితే ధోతి కుర్తా రంగు ఇంకా నిర్ణయించ లేదని వెల్లడించారు.శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయ ట్రస్ట్ కౌన్సిల్ అధ్యక్షుడు మరియు దానికి సంబంధించిన పండితులు మాత్రమే చర్చించి రంగును ఎంపిక చేస్తారని కూడా వెల్లడించారు.
దేవాలయంలో ఈ మొత్తం మార్పులు వెనక అసలు కారణం దేవాలయ గర్భగుడిలో అర్చకులు ఒక రంగు దుస్తులు ధరించాలి.తద్వారా వారిని సులభంగా గుర్తించవచ్చు.అయితే భక్తులకు కుడా ఎలాంటి మోసాలు జరగవు.అంతేకాకుండా ఆలయ పూజారులకే కాకుండా సేవాదార్లకు కూడా డ్రెస్ కోడ్ అమలులోకి వచ్చిందని కాశీ విశ్వనాథ దేవాలయం ట్రస్ట్ కౌన్సిల్ తో అనుబంధం ఉన్న పండిట్ దీపక్ మాల్వియా వెల్లడించారు.
అర్చాక్ మరియు సేవాదార్ కోసం వేరువేరు దుస్తులు ఉంటాయని తద్వారా ప్రతి ఒక్కరు వారిని గుర్తించగలరని వెల్లడించారు.దేవాలయ నిర్వాహకులు ఇద్దరికీ రెండు సెట్ల దుస్తులను అందించనున్నారు.ఈ సంవత్సరం భక్తుల సౌకర్యార్థం దాదాపు రూ.40 కోట్లు వేచించేందుకు దేవాలయ పాలకవర్గం అన్ని ఏర్పాట్లను చేసింది.
DEVOTIONAL