తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -  జూలై 8 , శుక్ర వారం, ఆషాడ మాసం

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.51

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

50

రాహుకాలం:ఉ.10.30 మ 12:00

అమృత ఘడియలు: ఉ.నవమి సా.4:40ల 6:00

Advertisement

దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 మ.12.48ల1.39

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల గురించి విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

వృషభం:

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈరోజు మీరు చేస్తే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.

Advertisement

సంతాన పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

ఈరోజు ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకపోవడం మంచిది.

మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.

కర్కాటకం:

ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగింది మీ చేతికి అందుతుంది.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

బయట మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సింహం:

ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన నిదానంగా పూర్తి చేస్తారు.మానసిక బలహీనత మీలో ఎక్కువగా ఉంటుంది.మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.

వారితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

ఈరోజు మీరు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే సోమత మీలో ఉంటుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి.

మీరు చేసే పనిలో అలసట ఎక్కువగా ఉంటుంది.ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.

తులా:

ఈరోజుతో మీ కోర్ట్ సమస్యలన్నీ తీరిపోతాయి.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.

శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.చేసే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి.

వృశ్చికం:

ఈరోజు మీరు చెడు సావాసాలకు దూరంగా ఉండడం మంచిది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశాలు ఉంది.

ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవడం మంచిది.

ధనస్సు:

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.మీరు చేపట్టిన పనుల్లో అంతా శుభం జరుగుతుంది.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

తోబుట్టువులతో కలిసి దూరపు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మకరం:

ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.స్నేహితుల ద్వారా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరు చేసే పనిలో ఓర్పు చాలా అవసరం.

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తరచూ మారే మీ నిర్ణయాలు వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుంభం:

ఈరోజు మీరు అనారోగ్యంతో సతమతమవుతాయి.దగ్గర్లో ఉన్న వైద్యుని సంప్రదించడం మంచిది.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.

ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

మీనం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది.మీరు ఏ పని మొదలు పెట్టిన నిదానంగా పూర్తి చేస్తారు.అనవసరంగా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.

తల్లిదండ్రులతో కలసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తాజా వార్తలు