తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ నటుడు ప్రభాకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో సీరియల్స్ నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాకర్.
అంతేకాకుండా తన భార్యతో కలిసి పలు షోలలో కూడా పాల్గొన్నారు ప్రభాకర్.అయితే కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా పలు సీరియల్స్ కు వ్యవహరించారు.
ఒకవైపు నటుడిగా వ్యవహరిస్తూనే మరొకవైపు పలు సీరియల్స్ కు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.అలాగే ఎంతోమందికి డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే కెరీర్ పరంగా ఎంత బిజీ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ఫ్యామిలీకి సంబంధించిన విషయాల గురించి పంచుకుంటూ ఉంటాడు ప్రభాకర్.కాగా ఒక సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
యూట్యూబ్ ఛానల్ ద్వారా తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలను, అలాగే వంటలకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా వీరు వారి యూట్యూబ్ ఛానల్ నుంచి పావుగంటలో పావ్ బాజీ అనే టైటిల్ తో ఒక వీడియోని విడుదల చేస్తూ అందులో పావు బాజీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానము గురించి వివరించారు.
కాకా చాలామంది పావ్ బాజీ ని లొట్టలు వేసుకొని మరీ తింటూ ఉంటారు.అయితే బయట కర్రీ పాయింట్స్ దగ్గర లభించే ఈ పావ్ బాజీ ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు.
ప్రభాకర్ అలాగే అతని భార్య మలయజ ఈ వంటకాన్ని తయారు చేయడంతో ప్రభాకర్ లొట్టలు వేసుకొని మరి లాగించేస్తున్నాడు.మరి దీనికి కావలసిన పదార్థాలు తయారీ విధానం ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పావ్ భాజీకి కావలసిన పదార్థాలు.నానబెట్టిన బఠానీక్యారెట్,టమాటో,బంగాళాదుంపలు,బీట్ రూట్, క్యాప్సికమ్,క్యాబేజీ,నిమ్మకాయ,అల్లం వెల్లుల్లి పేస్ట్ ,పావ్ భాజీ మసాలా,ఉప్పు, కారం, నూనె, పసుపు, కారం, కరివేపాకు, కొత్తెమీరా, పుదీనా.తయారీ విధానం.కూరగాయలన్నీ చిన్న ముక్కలుగా కోసుకుని స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌లో ఉడికించుకోవాలి.అలాగే అందులో నానబెట్టిన బఠానీలను కలుపుకుని కుక్కర్‌లో వేసి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉండాలి.ఇందులో కొంచెం కారం, పసుపు, మసాల వేసుకోవాలి.
మరో గిన్నెలో కొంచెం బటర్, నెయ్యి పోసి, ఉల్లిపాయలు వేయించుకోవాలి.ఆ తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు,అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలు ఉడికే వరకూ సన్నని మంటపై ఉంచాలి.
ముక్కలు బాగా వేగిన తరువాత కుక్కర్‌లో ఉడికించిన మిశ్రమాన్ని ఇందులో కలిపాలి.తరువాత పావ్ భాజీ మసాలా కలుపుకుని ఓ ఐదారు నిమిషాలు సన్నని మంటపై ఉడికించుకోవాలి.
ఆ తరువాత నిమ్మరసం, కొత్తెమీర, పుదీనా యాడ్ చేసుకుంటే ఘుమఘుమలాడే పావ్ భాజీ రెడీ రెడీ.








