బాన పొట్టతో( Belly Fat ) బాగా ఇబ్బంది పడుతున్నారా.? పొట్టను తగ్గించుకోవాలని భావిస్తున్నారా.? అయితే మీకు సొరకాయ అద్భుతంగా సహాయపడుతుంది.సొరకాయలో జింక్, మెగ్నీషియం, కాపర్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి, ఫైబర్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.
ఆరోగ్యపరంగా సొరకాయ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా వెయిట్ లాస్ కు మరియు బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి సొరకాయ అద్భుతంగా తోడ్పడుతుంది.మరి ఇంతకీ సొరకాయను ( Bottle gourd )ఎలా తీసుకుంటే బాన పొట్ట కరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక సొరకాయను తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు సొరకాయ ముక్కలు, పది ఫ్రెష్ పుదీనా ఆకులు,( Mint Leave ) హాఫ్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, వన్ టేబుల్ స్పూన్ తరిగిన అల్లం ముక్కలు, ( Ginger )పావు టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, అర గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని తాగేయాలి.రోజు ఉదయం ఈ సొరకాయ జ్యూస్ ను తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.బాన పొట్ట నెల రోజుల్లోనే మాయమవుతుంది.
పైగా ఈ సొరకాయ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది.
అధిక రక్తపోటు సమస్య దూరం అవుతుంది.సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.
మన శరీరంలోని అధిక వేడిని బయటకు పంపుతుంది.మరియు పైన చెప్పిన సొరకాయతో జ్యూస్ తయారు చేసుకుని తాగితే కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.