బ్రిటన్‌ ప్రధాని రేసులో రిషి సునాక్..

బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ నియమితులయ్యే అవకాశాలున్నాయి.వరుస వివాదాల్లో చిక్కుకున్న ప్రస్తుత ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా చేశారు.

 Rishi Sunak In Uk Prime Minister Race Details, Rishi Sunak, Britain Prime Minist-TeluguStop.com

దాంతో, తదుపరి ప్రధానిగా బాధ్యతలు ఎవరు చేపడ్తారన్నది ఆసక్తికరంగా మారింది.ఒకవేళ అదే జరిగితే బ్రిటన్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్‌ అరుదైన ఘనత సాధించనున్నారు.

బ్రిటన్ ప్రధాని పర్టీ నేతల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు తన పదవికి రాజీనామా చేశారు.బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్నారు.

కరోనా సమయంలో అధికార నివాసంలో పార్టీ చేసుకున్నందుకు గానూ ఆయనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి…ఆ తర్వాత మరో వివాదంలో ఇరుక్కున్నారు.దాంతో, సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారు.

ఈ నేపథ్యంలో రిషి సునాక్‌ పేరు బ్రిటన్ ప్రదాని రేసులో వినిపిస్తోంది…1980 మే 12న ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌లో రిషి సునాక్‌ జన్మించారు.మొదట వారు తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి.

అక్కడి నుంచి పిల్లలతో సహా యూకేకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.వీరి కుటుంబాలు బ్రిటన్‌కు వలస వెళ్లాక యశ్‌వీర్‌, ఉషల వివాహం జరిగింది.

Telugu Rishi Sunak, Akshatha, Boris Johnson, Borisjohnson, Britain Prime, Conser

స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ చేసిన రిషి.అక్కడ కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు.కాలిఫోర్నియాలో చదువుతున్న రోజుల్లో ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతాతో ప్రేమలో పడ్డారు.పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు…

2019లో జరిగిన కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో సునాక్.బోరిస్‌ జాన్సన్‌కు మద్దతిచ్చారు.

బోరిస్‌ ప్రధానిగా ఎన్నికైన తర్వాత సునాక్ కు ఆర్థిక శాఖలో చీఫ్‌ సెక్రటరీగా కీలక బాధ్యతలు అప్పగించారు.బోరిస్‌ జాన్సన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా సునాక్‌కు పేరుంది.

తన వ్యక్తిత్వం, దూకుడు శైలితో రైజింగ్‌ స్టార్‌ మినిస్టర్‌గా సునాక్ గుర్తింపు పొందారు.సునాక్ పనితీరుకు మెచ్చి 2020 ఫిబ్రవరిలో ఆర్థికమంత్రిగా పదోన్నతి కల్పించారు.

Telugu Rishi Sunak, Akshatha, Boris Johnson, Borisjohnson, Britain Prime, Conser

హిందువైన సునాక్‌.బ్రిటన్ ఎంపీగా భగవద్గీతపై ప్రమాణం చేశారు…తదుపరి ప్రధాని రేసులో రిషి సునాక్‌తో పాటు వాణిజ్యమంత్రి పెన్నీ మార్డాంట్‌, రక్షణ మంత్రి బెన్‌ వాలెస్‌, విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌, మాజీ ఆరోగ్య మంత్రి సాజిద్‌ జావిద్‌, ప్రస్తుత ఆర్థికమంత్రి నదీమ్‌ జహావీ, మాజీ విదేశాంగ మంత్రి జెరెమీ హంట్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.బోరిస్‌ జాన్సన్‌పై అవిశ్వాసం వ్యక్తం చేస్తూ రిషి సునాక్‌ ఇటీవల తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.ఆయన నిర్ణయం తర్వాతే వరుసగా మిగతా మంత్రుల రాజీనామాల పరంపర కొనసాగింది.

ఈ నేపథ్యంలోనే ప్రధాని రేసులో సునాక్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube