అసలే సమ్మర్ సీజన్ అందులోనూ మే నెల ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇక ఈ ఏడాది ఊహించిన దానికంటే అధికంగా ఎండలు వీస్తున్నాయి.
భానుడి భగ భగలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.ఇక ఈ వేసవిలో శరీర వేడి ఎక్కువగా ఉంటుంది.
ఈ వేడిని తగ్గించాలంటే ఆహారాలే కాదు కొన్ని కొన్ని ఎక్సర్సైజ్లు కూడా ఉపయోగపడతాయి.అలాంటి వాటిలో స్విమ్మింగ్ కూడా ఒకటి.
వాస్తవానికి ఎరోబిక్ ఎక్సర్‌సైజ్‌లలో స్విమ్మింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్.అందుకే చాలా మంది రోజులో పది నిమిషాలైనా స్విమ్మింగ్ చేస్తుంటారు.అయితే ఎంతో సరదానిచ్చే ఈ స్విమ్మింగ్‌ను సమ్మర్లో రెగ్యులర్‌గా చేస్తే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.మరి ఆ బెనిఫిట్స్ ఏంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
పైన చెప్పుకున్నట్టు శరీర వేడిని తగ్గించడంలో స్విమ్మింగ్ అద్భుతంగా సహాయపడుతుంది.ప్రతి రోజు కనీసం పావు గంట పాటు స్విమ్ చేస్తే.వేడి తగ్గి శరీరం చల్లబడుతుంది.మరియు అతి దాహం, అధిక చెమటలు, చికాకు వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.అలాగే బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి స్విమ్మింగ్ బెస్ట్ అప్షన్.రెగ్యులర్‌గా అర గంట నుంచి గంట పాటు స్విమ్మింగ్‌కు కేటాయిస్తే.
ఫాస్ట్‌గా క్యాలరీలు కరుగుతాయి.దాంతో వెయిట్ లాస్ అవ్వొచ్చు.
ప్రతి రోజు కొంత సమయం పాటు స్విమ్మింగ్ చేస్తే ఒత్తిడి, డిప్రెషన్, తలనొప్పి వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి.మంచి నిద్ర పడుతుంది.మనసు ఎల్లప్పుడూ ప్రశాంతంగా కూడా ఉంటుంది.అలాగే గుండె ఆరోగ్యానికి స్విమ్మింగ్ ఎంతో మంచిది.
రోజూ స్విమ్ చేస్తే గుండె పోటు, ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.ఇక స్విమ్మింగ్ చేయడం వల్ల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది.