నెల‌స‌రి టైమ్‌లో క‌డుపు ఉబ్బ‌రాన్ని నివారించే సూప‌ర్ టిప్స్ ఇవే!

నెల‌స‌రి ఆడ‌వారంద‌రికీ ఒకేలా ఉండ‌దు.కొంద‌రికీ ఎంతో బాధ‌క‌రంగా ఉంటే.

మ‌రికొంద‌రికి సులువుగా అయిపోతుంది.

అయితే నెల‌స‌రి స‌మ‌యంలో చాలా మందిని స‌త‌మ‌తం చేసే స‌మ‌స్య‌ల్లో క‌డుపు ఉబ్బ‌రం ఒక‌టి.

క‌డుపు ఉబ్బ‌రం కార‌ణంగా ఏం తినాల‌న్నా వెన‌క‌డుగు వేస్తుంటారు.ఈ క్ర‌మంలోనే ఆ మూడు రోజులు ఫుడ్ విష‌యంలో అశ్ర‌ద్ద‌గా వ్య‌వ‌హ‌రిస్తూ నీర‌సానికి వ‌చ్చేస్తుంటారు.

అందుకే నెల‌స‌రి టైమ్‌లో ఇబ్బంది పెట్టే క‌డుపు ఉబ్బ‌రాన్ని నివారించుకోవ‌డం ఎంతో ముఖ్యం.అందుకు ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ అద్భుతంగా స‌హాయ‌డ‌ప‌తాయి.

Advertisement

మ‌రి ఆ టిప్స్ ఏంటో ఓ లుక్కేసేయండి.కొబ్బ‌రి నీళ్లు.

క‌డుపు ఉబ్బ‌రాన్ని త‌గ్గించ‌డంలో సూప‌ర్‌గా హెల్ప్ చేస్తాయి.నెల‌స‌రి స‌మ‌యంలో ఎవ‌రైతే క‌డుపు ఉబ్బ‌రంతో తీవ్రంగా బాధ‌ప‌డుతున్నారో వారు ఒక గ్లాస్ కొబ్బ‌రి నీళ్ల‌లో వ‌న్ టేబుల్ స్పూన్ పుదీనా జ్యూస్, వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్‌ క‌లిపి సేవిస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

అలాగే మూడు టేబుల్ స్పూన్ల జీల‌క‌ర్రను వేయించి పొడి చేసుకోవాలి.ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో అర స్పూన్ జీల‌క‌ర్ర పొడి, కొద్దిగా న‌ల్ల ఉప్పు క‌లిపి సేవించాలి.

ఇలా చేసినా కూడా క‌డుపు ఉబ్బ‌రం నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.నెల‌స‌రి స‌మ‌యంలో క‌డుపు ఉబ్బ‌రంగా ఉన్న‌ప్పుడు కొన్ని సోంపు గింజ‌ల‌ను నోట్లో వేసి బాగా న‌మిలి మింగాలి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఆపై ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిని తీసుకోవాలి.ఇలా చేసినా క‌డుపు ఉబ్బ‌రం స‌మ‌స్య దూరం అవుతుంది.

Advertisement

ఇక వీటితో పాటు చిన్న‌ చిన్న వ్యాయామాలు చేయాలి.ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి.టీ, కాఫీ, సోడా, కూల్ డ్రింక్స్ తాగ‌డం మానేసి.

ఒక క‌ప్పు గ్రీన్ టీని సేవించాలి.తద్వారా క‌డుపు ఉబ్బ‌రం స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది.

తాజా వార్తలు