సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాను మరో హీరో చేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది.ఇక ఆ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు.
అయితే ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనే చెప్పాలి .అయితే ముందుగా ఈ సినిమాని పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో చేయాలని అనుకోలేదు అన్న వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.పూరి జగన్నాథ్ ముందుగా ముగ్గురు స్టార్ హీరోల కు ఈ సినిమా కథను వినిపించాడట.
ఇక ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లైగర్ సినిమా కథ హీరో పాత్ర బాడీలాంగ్వేజ్ అటు అల్లు అర్జున్ కి సరిగ్గా సరిపోతాయని పూరి జగన్నాథ్ అనుకున్నాడట.ఈ క్రమంలో ఈ సినిమాను అల్లుఅర్జున్తో తీయాలని ముందుగా అతనికి కూడా వినిపించాడట.అయితే అప్పటికే బన్నీ షూటింగ్ లో బిజీగా ఉండటం కారణంగా చేసేదేమీలేక సినిమాను వదులుకున్నాడట.

ఆ తరవాత ఈ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తో తీయాలని భావించాడట పూరి జగన్నాథ్.అయితే తారక్ అప్పటికే జక్కన్న సినిమాతో కనెక్ట్ అయి ఉన్నాడు.ఇక జక్కన్న సినిమా అంటే అది పూర్తయ్యే వరకు హీరోలను చేతిలోనుంచి అస్సలు వదిలిపెట్టడు.దీంతో ఇక తారక్ కూడా బిజీగా ఉండటం కారణంగా వదులుకున్నాడట.ఇక చివరిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు కథ వినిపించాడట.ప్రభాస్ కి కథ కూడా బాగా నచ్చేసింది.
కానీ అప్పటికి ప్రభాస్ డేట్స్ అన్నీ కూడా మిగతా సినిమాలకు ఇచ్చేశాడు.నెక్స్ట్ టైం చూద్దాంలే డార్లింగ్ అంటూ రిజక్ట్ చేశాడట ప్రభాస్.
ఇలా ముగ్గురు హీరోలు రిజక్ట్ చేసిన సినిమా చివరి రౌడీ హీరో కి దక్కింది.మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటించింది అన్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ తో కనిపించడమే కాదు అటు యాక్షన్ సన్నివేశాలలో కూడా ఆదరగొట్టేస్తున్నాడు అన్నది ఇటీవలే విడుదలైన ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.