జుట్టు ఆరోగ్యానికి వరం విటమిన్ ఈ ఆయిల్.. ఎలా వాడాలో తెలుసా?

విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) గురించి అందరికీ తెలిసిందే.చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు విటమిన్ ఈ ఆయిల్ అద్భుతంగా తోడ్పడుతుంది.

 Best Ways To Use Vitamin E Oil For Hair , Vitamin E Oil, Latest News, Hai-TeluguStop.com

ముఖ్యంగా జుట్టు ఆరోగ్యానికి విటమిన్ ఈ ఆయిల్ ఒక వరం అని చెప్పుకోవచ్చు.అయితే ఈ ఆయిల్ ను ఎలా వాడాలి అన్నది చాలా మందికి అవగాహన ఉండదు.

విటమిన్ ఈ అనేది ఒక పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్.విటమిన్ ఈ బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది.

హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేస్తుంది.అదే సమయంలో మరెన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

మరి ఇంతకీ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )ను ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Dry, Care, Care Tips, Fall, Healthy, Latest, Thick, Vitamin Oil, Vitamino

విటమిన్ ఈ ఆయిల్ ను నేరుగా తలకు అప్లై చేసుకోవచ్చు.ఆయిల్ ను తీసుకుని స్కాల్ప్ కు పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.అరగంట అనంతరం తలస్నానం చేయాలి.

తద్వారా జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.జుట్టు ఎదుగుదలను విటమిన్ ఈ ఆయిల్ ప్రోత్సహిస్తుంది.

హెయిర్ ఫాల్ సమస్యకు( hair fall problem ) చెక్ పెడుతుంది.జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది.

అలాగే చాలా మంది డ్రై హెయిర్( Dry hair ) సమస్యతో బాధపడుతుంటారు.అలాంటి వారు నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగులో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం తలస్నానం చేయాలి.

ఇలా చేస్తే డ్రై హెయిర్ సమస్య దూరం అవుతుంది.కురులు స్మూత్ గా సిల్కీగా మారతాయి.

Telugu Dry, Care, Care Tips, Fall, Healthy, Latest, Thick, Vitamin Oil, Vitamino

ఇక‌ చుండ్రు సమస్యతో( Dandruff problem ) బాధపడేవారు మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి.గంట అనంతరం తల స్నానం చేయాలి.వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు సమస్య పరార్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube