జుట్టు ఆరోగ్యానికి వరం విటమిన్ ఈ ఆయిల్.. ఎలా వాడాలో తెలుసా?

విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ) గురించి అందరికీ తెలిసిందే.

చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు విటమిన్ ఈ ఆయిల్ అద్భుతంగా తోడ్పడుతుంది.ముఖ్యంగా జుట్టు ఆరోగ్యానికి విటమిన్ ఈ ఆయిల్ ఒక వరం అని చెప్పుకోవచ్చు.

అయితే ఈ ఆయిల్ ను ఎలా వాడాలి అన్నది చాలా మందికి అవగాహన ఉండదు.

విటమిన్ ఈ అనేది ఒక పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్.విటమిన్ ఈ బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది.

హెయిర్ గ్రోత్ ను ఇంప్రూవ్ చేస్తుంది.అదే సమయంలో మరెన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

మరి ఇంతకీ విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E Oil )ను ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / విటమిన్ ఈ ఆయిల్ ను నేరుగా తలకు అప్లై చేసుకోవచ్చు.

ఆయిల్ ను తీసుకుని స్కాల్ప్ కు పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.అరగంట అనంతరం తలస్నానం చేయాలి.

తద్వారా జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.జుట్టు ఎదుగుదలను విటమిన్ ఈ ఆయిల్ ప్రోత్సహిస్తుంది.

హెయిర్ ఫాల్ సమస్యకు( Hair Fall Problem ) చెక్ పెడుతుంది.జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది.

అలాగే చాలా మంది డ్రై హెయిర్( Dry Hair ) సమస్యతో బాధపడుతుంటారు.

అలాంటి వారు నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగులో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం తలస్నానం చేయాలి.ఇలా చేస్తే డ్రై హెయిర్ సమస్య దూరం అవుతుంది.

కురులు స్మూత్ గా సిల్కీగా మారతాయి. """/" / ఇక‌ చుండ్రు సమస్యతో( Dandruff Problem ) బాధపడేవారు మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ) వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి.గంట అనంతరం తల స్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు సమస్య పరార్ అవుతుంది.

విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ పరిస్థితి ఏంటి..?