టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power Star Pawan Kalyan )అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ.సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో ఓజి సినిమా కూడా ఒకటి.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.
అయితే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ బిజీ అవడంతో ఈ సినిమా ఆలస్యం అయింది.
ఇది ఇలా ఉంటే ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించిన వార్తలు తరచుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.
కాగా తాజాగా థమన్( Thaman ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.నేను మీసం తిప్పి మరీ చెప్తున్నా ఓజీ అన్ని సినిమాలకూ సమాధానం చెబుతుంది.అది వచ్చినప్పుడు మనం ఎవరో తమిళ వాళ్ళకి తెలుస్తుంది.
మనం ఏంటనేది ఆ సినిమాతో చూపిస్తాం అంతే.ఒక గ్యాంగ్ స్టర్ ఫిలిం మనం చేస్తే ఎలా ఉంటుందనేది తెలుస్తుంది.
జైలర్, లియో, బీస్ట్, విక్రమ్ ( Jailer, Leo, Beast, Vikram )ఈ నాలుగు సినిమాలకు కలిపి ఓజీ ఒకే ఆన్సర్ ఇస్తుంది.అది మాకు తెలుసు.
మన హీరోలు కూడా గ్యాంగ్ స్టర్ సినిమాలు చేస్తే కంటెంట్ మారుతుంది, దానికి తగ్గట్టే సౌండింగ్ మారుతుంది అని చెప్పారు.
ఈ సందర్భంగా థమన్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అనంతరం థమన్ మాట్లాడుతూ.ఓజీ ఒక అసాధారణమైన సినిమా.
తమిళ చిత్రాలు వచ్చినప్పుడు మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో, దానికి టాలీవుడ్ నుంచి ఇచ్చే పెద్ద సమాధానం ఈ సినిమా.ఇందులో OST చాలా పెద్దగా ఉండబోతోంది.30 నుంచి 40 ట్రాక్స్ ఓఎస్టీ ఉంటుంది.డెఫినెట్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బెస్ట్ OST క్రియేట్ అవుతుంది.ఎందుకంటే ఆ సినిమా అలా వుంది కాబట్టి, ఓఎస్టీ కూడా అలానే ఉంటుంది.6 – 7 సాంగ్స్ ఉంటాయి.ఆల్రెడీ 4 పాటలు ఫినిష్ చేశాం.మిగతా పాటల కోసం సినిమా రిలీజ్ అయ్యే ముందు కూర్చోవాలని అనుకుంటున్నాం అని తమన్ తెలిపారు.