రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?

హెయిర్ ఫాల్ ( Hair fall )అనేది ఎంతో మందిని కలవరపెట్టే సమస్య.జుట్టు రాలడం గురించి కొందరు పెద్దగా పట్టించుకోరు.

 Hair Fall Go Away With Two Spoons Of Rice-TeluguStop.com

కానీ కొందరు మాత్రం హెయిర్ ఫాల్ విషయంలో ఎంతగానో వర్రీ అయిపోతుంటారు.జుట్టు రాలడాన్ని అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇకపై చింతించకండి.వంటింట్లో ఉంటే బియ్యంతో జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు.అందుకు బియ్యాన్ని ఏ విధంగా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Care, Care Tips, Fall Fall, Serum, Healthy, Latest, Fall-Telugu Health

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం ( spoons of rice )వేసి వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.ఆపై ఒక కప్పు వాటర్ పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో అర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక అందులో నానబెట్టుకున్న బియ్యాన్ని నీటితో సహా వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ లవంగాలు( cloves ), అంగుళం దాల్చిన చెక్క వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ఫిల్టర్ చేసి చల్లారబెట్టుకోవాలి.

గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్( Aloe vera gel ), వన్ టీ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే మంచి హెయిర్ సీరం సిద్ధమవుతుంది.

Telugu Care, Care Tips, Fall Fall, Serum, Healthy, Latest, Fall-Telugu Health

ఈ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం తేలిక పాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ సీరం ను వాడితే హెయిర్ ఫాల్ అన్నమాట అన‌రు.

ఈ సీరం జుట్టును మూలాల నుంచి బలోపేతం చేస్తుంది.జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడుతుంది.

పురుషుల్లో బట్టతల వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.అలాగే ఈ సీరం ను వాడటం వల్ల జుట్టు దృఢంగా మారుతుంది.

విరగడం, చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి.అలాగే ఈ సీరం జుట్టును సిల్కీగా షైనీగా మారుస్తుంది.

కాబట్టి జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న సీరం ను వాడటం అలవాటు చేసుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube