సాధారణంగా కొందరికి జుట్టు ఎదుగుదల( Hair Growth ) అనేది సరిగ్గా ఉండదు.ఎంత ఖరీదైన ఆయిల్స్ వాడినప్పటికీ ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది.
పైగా జుట్టు ఎదుగుదల లేకపోవడం, ఉన్న జుట్టు ఊడిపోవడం వల్ల కురులు పల్చగా మారిపోతాయి.మీరు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారా? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.కలబందతో( Aloevera ) ఇప్పుడు చెప్పబోయే హెయిర్ గ్రోత్ సీరం ను తయారు చేసుకుని వాడితే వద్దన్నా కూడా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం సీరంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక కలబంద ఆకును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో కట్ చేసుకున్న కలబంద ముక్కలు మరియు ఒక కప్పు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సాస్ పాన్ పెట్టి అందులో గ్రైండ్ చేసుకుని మిశ్రమాన్ని వేసి దాదాపు 8 నిమిషాల పాటు ఉడికించాలి.ఆపై అందులో నాలుగు ఎండిన మందారం పువ్వులు( Dry Hibiscus ) మరియు వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek ) వేసి మరొక ఆరేడు నిమిషాల పాటు ఉడికిస్తే మన సీరం దాదాపు సిద్ధమవుతుంది.
స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక స్టైనర్ సహాయంతో సీరంను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ అలోవెరా హెయిర్ గ్రోత్ సీరంను స్కాల్ప్ తో జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని నాలుగు గంటల తర్వాత లేదా మరుసటి రోజు తేలిక పాటి షాంపూను ఉపయోగించి తలస్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ విధంగా చేశారంటే జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.
కురులకు చక్కని పోషణ అందుతుంది.హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.
జుట్టు రాలడం విరగడం తగ్గుతాయి.అలాగే ఈ కలబంద సీరం ను వాడడం వల్ల చుండ్రు సమస్య దూరం అవుతుంది.
స్కాల్ప్ హైడ్రేట్ గా మరియు హెల్తీగా మారుతుంది.